Egasakkemulu gaavu yela navve vimdugum gaa

ఎగసక్కెములు గావు యేల నవ్వే విందుకుఁ గా
Language

(॥పల్లవి॥)
ఎగసక్కెములు గావు యేల నవ్వే విందుకుఁ గా
మగువ యింతకలోన మంచ మెక్కు కుండును

(॥ఎగ॥)
చెలి యొక్కమాట నీతోఁ జెప్ప మఱచితి ననె
అలరి యింటిదాఁకా రమ్మను మనె
తలఁచి తా వచ్చె నంటా తలవాకిటికి వచ్చె
చెలువుఁడ మాతో నది చెప్పరాని దనెను

(॥ఎగ॥)
ప్రేమ నీమై నెట్టొ సొమ్ము వెట్టి మఱచితి ననె
దీమసాన నీకె అది తెలుసు ననె
మేమూఁ గాక పావురముమెడఁ జీటిఁగట్టి యంపె
ఆమేఁ లు నీకుఁ దానే అందించె ననెను

(॥ఎగ॥)
అడ నుంటేఁదనమీఁది ఆన నీకుఁ బెట్టు మనే
యీడనే నీకన్ను దని యించె ననె
కూడితి వింతలో నాపెఁ గోరి శ్రీవేంకటేశుఁడ
జోడై నీవునుఁ దానే చొక్కినార మనెను

(||pallavi||)
ĕgasakkĕmulu gāvu yela navve viṁdugum̐ gā
maguva yiṁtagalona maṁcha mĕkku kuṁḍunu

(||ĕga||)
sĕli yŏkkamāḍa nīdom̐ jĕppa maṟasidi nanĕ
alari yiṁṭidām̐kā rammanu manĕ
talam̐si tā vachchĕ naṁṭā talavāgiḍigi vachchĕ
sĕluvum̐ḍa mādo nadi sĕpparāni danĕnu

(||ĕga||)
prema nīmai nĕṭṭŏ sŏmmu vĕṭṭi maṟasidi nanĕ
dīmasāna nīgĕ adi tĕlusu nanĕ
memūm̐ gāga pāvuramumĕḍam̐ jīḍim̐gaṭṭi yaṁpĕ
āmem̐ lu nīgum̐ dāne aṁdiṁchĕ nanĕnu

(||ĕga||)
aḍa nuṁṭem̐danamīm̐di āna nīgum̐ bĕṭṭu mane
yīḍane nīgannu dani yiṁchĕ nanĕ
kūḍidi viṁtalo nābĕm̐ gori śhrīveṁkaḍeśhum̐ḍa
joḍai nīvunum̐ dāne sŏkkināra manĕnu