ఎగసక్కేలే సేసీ నిదే మీతఁడు
(॥పల్లవి॥)
ఎగసక్కేలే సేసీ నిదే మీతఁడు
నగవు వచ్చీఁ దన నాఁటకములకును
(॥॥)
కోరి నేఁ గానుకిచ్చిన గొప్పతమ్మిపువ్వందుక
వేరొకతెచన్ను దాఁ కవేసీనే తాను
సారెకు నెవ్వతో మేనిజవ్వాదిపై వడిసితే
మేరమీరి యది నా మేనఁ దుడిచీనే
(॥॥)
చేతికిచ్చినవిడెము సేసి పుక్కిటఁ బెట్టుక
కాతరానఁ బెట్టీఁ దమ్మకడఁ దానికి
రాతిరెల్లా జాగారాలు రతి నెందోసేసి వచ్చి
యీతల నిద్రించీ మాయింటిలోనను
(॥॥)
అద్దమునాచేఁ దెప్పించి యండనున్నసతిమోము
నిద్దమై తనమోమునీడ చూచీనే
అద్దుక శ్రీవేంకటేశుఁ డల్లాకెమేనిగందము
ఉద్దండాన నాకాఁగిట నొనర నంటించీనే
(||pallavi||)
ĕgasakkele sesī nide mīdam̐ḍu
nagavu vachchīm̐ dana nām̐ṭagamulagunu
(||||)
kori nem̐ gānugichchina gŏppadammibuvvaṁduga
verŏgadĕsannu dām̐ kavesīne tānu
sārĕgu nĕvvado menijavvādibai vaḍiside
meramīri yadi nā menam̐ duḍisīne
(||||)
sedigichchinaviḍĕmu sesi pukkiḍam̐ bĕṭṭuga
kādarānam̐ bĕṭṭīm̐ dammagaḍam̐ dānigi
rādirĕllā jāgārālu radi nĕṁdosesi vachchi
yīdala nidriṁchī māyiṁṭilonanu
(||||)
addamunāsem̐ dĕppiṁchi yaṁḍanunnasadimomu
niddamai tanamomunīḍa sūsīne
adduga śhrīveṁkaḍeśhum̐ ḍallāgĕmenigaṁdamu
uddaṁḍāna nāgām̐giḍa nŏnara naṁṭiṁchīne