ఎగసక్కేలకే వచ్చీ నెంత బలువు
(॥పల్లవి॥)
ఎగసక్కేలకే వచ్చీ నెంత బలువు
తగనిచేతఁలు చేసి తమకించీఁ దాను
(॥ఎగ॥)
వేళగాని వేళ వచ్చి వేలఁ దలుపు మీటుచు
లే లెమ్మని పేరునఁ బిలిచీనే తాను
పాలుమాలి నిద్దురతో పవళించి నే నుండఁగా
వోలి సోరణగండ్ల నుంట వింట వేసీనే
(॥ఎగ॥)
వాడలు దిరిగి వచ్చి వాకిటఁ దాఁ గూచుండి
ఆడకు నన్ను రమ్మంటా నానవెట్టీనే
వోడక నే నూరకుంటే వొద్దనున్న చెలులచే
వీడెము దెప్పించుక వే వేగ లోను చొచ్చేనే
(॥ఎగ॥)
వింతవాసనలతోడ విచ్చేసి నన్నుఁ గౌఁగిట
యెంత వొల్లా నన్న మానఁ డెటు గూడెనే
పంతపు శ్రీవేంకటాద్రిపతి నన్ను భ్రమయించి
మంతనానఁ గోప మెల్ల మఱపించె నిదివో
(||pallavi||)
ĕgasakkelage vachchī nĕṁta baluvu
taganisedam̐lu sesi tamagiṁchīm̐ dānu
(||ĕga||)
veḽagāni veḽa vachchi velam̐ dalubu mīḍusu
le lĕmmani perunam̐ bilisīne tānu
pālumāli niddurado pavaḽiṁchi ne nuṁḍam̐gā
voli soraṇagaṁḍla nuṁṭa viṁṭa vesīne
(||ĕga||)
vāḍalu dirigi vachchi vāgiḍam̐ dām̐ gūsuṁḍi
āḍagu nannu rammaṁṭā nānavĕṭṭīne
voḍaga ne nūraguṁṭe vŏddanunna sĕlulase
vīḍĕmu dĕppiṁchuga ve vega lonu sŏchchene
(||ĕga||)
viṁtavāsanaladoḍa vichchesi nannum̐ gaum̐giḍa
yĕṁta vŏllā nanna mānam̐ ḍĕḍu gūḍĕne
paṁtabu śhrīveṁkaḍādribadi nannu bhramayiṁchi
maṁtanānam̐ goba mĕlla maṟabiṁchĕ nidivo