Egasakkebu vala pemdaamkaa

ఎగసక్కెపు వల పెందాఁకా
Language

(॥పల్లవి॥)
ఎగసక్కెపు వల పెందాఁకా
మొగమోటములే మోపా నాకు

(॥ఎగ॥)
చనవున నే నటు సారెకుఁ బెనఁగఁగ
ననుపు చేకొని నవ్వితివి
మనసు రానిపని మర్మము నాఁటదు
చెనకకు మిది యొక సెలవా నాకు

(॥ఎగ॥)
చుట్టరికంబుల సొలసి పలువఁగా
పొటపఁబొరుగు కటు పొలసితి
పెట్టుతమకములు ప్రేమల కెక్కెవు
పట్టకు మిది యొకభ్రమతా నాకు

(॥ఎగ॥)
కందువ నేనటు కాఁగిలిచఁగా
అందము చేక యలమితివి
యిందునె శ్రీవెంకటేశ్వర తీరదు
కిందుపడకు మిది గెలుపా నాకు

(||pallavi||)
ĕgasakkĕbu vala pĕṁdām̐kā
mŏgamoḍamule mobā nāgu

(||ĕga||)
sanavuna ne naḍu sārĕgum̐ bĕnam̐gam̐ga
nanubu segŏni navvidivi
manasu rānibani marmamu nām̐ṭadu
sĕnagagu midi yŏga sĕlavā nāgu

(||ĕga||)
suṭṭarigaṁbula sŏlasi paluvam̐gā
pŏḍabam̐bŏrugu kaḍu pŏlasidi
pĕṭṭudamagamulu premala kĕkkĕvu
paṭṭagu midi yŏgabhramadā nāgu

(||ĕga||)
kaṁduva nenaḍu kām̐gilisam̐gā
aṁdamu sega yalamidivi
yiṁdunĕ śhrīvĕṁkaḍeśhvara tīradu
kiṁdubaḍagu midi gĕlubā nāgu