ఎగసక్కె మాడితేనె యెంత సేసేవు
(॥పల్లవి॥)
ఎగసక్కె మాడితేనె యెంత సేసేవు
మగువతోనె నేఁడు మంకు లేల నీకును
(॥ఎగ॥)
పలుమారుఁ బిలిపించీ పదవయ్య చెలి నిన్ను
అలిగి వచ్చితి వంటా అప్పటినుండి
చల మెంత గలిగిన సతి నీవు గూడుకుంటె
తెలుసుకొందురు గాక తెగు వేల యీడను
(॥ఎగ॥)
వాకిట నిలుచున్నది వచ్చినదాఁకా నీవు
రాక తా నారగించదు రమణి నేఁడు
యేకతాన నాపెతోనె యే మన్నా నందువు గాని
వాకునిష్ణూరము లేల వద్దు వద్దు యీడను
(॥ఎగ॥)
కొంగు వట్టి తీసీ నిన్ను కొమ్మ దానె యిందు వచ్చి
వుంగిటిఁ జిన్నఁబోయి వున్నాఁడ వంటా
అంగవించి శ్రీవెంకటాధిప కూడితి విట్టె
వెంగలియాన లెల్ల విడవయ్య యిఁకను
(||pallavi||)
ĕgasakkĕ māḍidenĕ yĕṁta sesevu
maguvadonĕ nem̐ḍu maṁku lela nīgunu
(||ĕga||)
palumārum̐ bilibiṁchī padavayya sĕli ninnu
aligi vachchidi vaṁṭā appaḍinuṁḍi
sala mĕṁta galigina sadi nīvu gūḍuguṁṭĕ
tĕlusugŏṁduru gāga tĕgu vela yīḍanu
(||ĕga||)
vāgiḍa nilusunnadi vachchinadām̐kā nīvu
rāga tā nāragiṁchadu ramaṇi nem̐ḍu
yegadāna nābĕdonĕ ye mannā naṁduvu gāni
vāguniṣhṇūramu lela vaddu vaddu yīḍanu
(||ĕga||)
kŏṁgu vaṭṭi tīsī ninnu kŏmma dānĕ yiṁdu vachchi
vuṁgiḍim̐ jinnam̐boyi vunnām̐ḍa vaṁṭā
aṁgaviṁchi śhrīvĕṁkaḍādhiba kūḍidi viṭṭĕ
vĕṁgaliyāna lĕlla viḍavayya yim̐kanu