Egaraajya mayya neegu nimpulaaya nide naagu

ఏకరాజ్య మయ్య నీకు నింపులాయ నిదే నాకు
Language

(॥పల్లవి॥)
ఏకరాజ్య మయ్య నీకు నింపులాయ నిదే నాకు
రాకవెన్నెలలు వచ్చె రావయ్య లోనికి

(॥॥)
విచ్చనవిడాయ నీకు వేడుకలెల్లా జెల్లె
పచ్చిదేరి నామోవి ఫలమందెను
కచ్చుపెట్టి నెచ్చెలులు కందువఁ బొందుసేసిరి
రచ్చల నిండె వలపు రావయ్య లోనికి

(॥॥)
నవ్వులు నిజములాయ నారుకొనెఁ బంతములు
ఇవ్వల నాజవ్వనము యీడుఁజోడాయ
వువ్విళ్లూరె మనసులు వొద్దికఁ బెండ్లిసేసె
రవ్వసేసెఁ దమకము రావయ్య లోనికి

(॥॥)
కతలాయ నీమాటలు కాఁపురము సతమాయ
తతిఁ గూడె నాకూటమి తనివిచ్చెను
యితవై శ్రీవేంకటేశ యింపులు పొత్తుగలసె
రతు లిట్టె వొనగూడె రావయ్య లోనికి

(||pallavi||)
egarājya mayya nīgu niṁpulāya nide nāgu
rāgavĕnnĕlalu vachchĕ rāvayya lonigi

(||||)
vichchanaviḍāya nīgu veḍugalĕllā jĕllĕ
pachchideri nāmovi phalamaṁdĕnu
kachchubĕṭṭi nĕchchĕlulu kaṁduvam̐ bŏṁdusesiri
rachchala niṁḍĕ valabu rāvayya lonigi

(||||)
navvulu nijamulāya nārugŏnĕm̐ baṁtamulu
ivvala nājavvanamu yīḍum̐joḍāya
vuvviḽlūrĕ manasulu vŏddigam̐ bĕṁḍlisesĕ
ravvasesĕm̐ damagamu rāvayya lonigi

(||||)
kadalāya nīmāḍalu kām̐puramu sadamāya
tadim̐ gūḍĕ nāgūḍami tanivichchĕnu
yidavai śhrīveṁkaḍeśha yiṁpulu pŏttugalasĕ
radu liṭṭĕ vŏnagūḍĕ rāvayya lonigi