ఏకమై వుండినచోటి(ట?) యెగ్గులేఁటివి
(॥పల్లవి॥)
ఏకమై వుండినచోటి(ట?) యెగ్గులేఁటివి
నీకు నాకెకును సరే నేరములేలయ్యా
(॥ఏక॥)
మతిలో మఱఁగు లేదు మోటల కొదువలేదు
సతికి నీ విచ్చినట్టి చనవే కాని
రతివేళ నీతోడ రాజసము చూపెనంటా
చతురుఁడ వింత యాల సాదించేవయ్యా
(॥ఏక॥)
కన్నుల కసరులేదు గర్వ మించుకంత లేదు
కన్నెకు నేరిపిననీ కట్టిడే కాని
వున్నతపు కొనగోరు వూఁది నీతో నవ్వెనంటా
యెన్నేసి గడించుకొనే వేడసుద్దులయ్యా
(॥ఏక॥)
వేసట యేమీ లేదు వెఁగెములాడేది గాదు
యీసతికి కాఁగిటినీయీవులేకాని
ఆసల శ్రీవేంకటేశ అలయించి కూడెనంటా
వాసులేల పట్టేవు వరము లీవయ్యా
(||pallavi||)
egamai vuṁḍinasoḍi(ṭa?) yĕggulem̐ṭivi
nīgu nāgĕgunu sare neramulelayyā
(||ega||)
madilo maṟam̐gu ledu moḍala kŏduvaledu
sadigi nī vichchinaṭṭi sanave kāni
radiveḽa nīdoḍa rājasamu sūbĕnaṁṭā
sadurum̐ḍa viṁta yāla sādiṁchevayyā
(||ega||)
kannula kasaruledu garva miṁchugaṁta ledu
kannĕgu neribinanī kaṭṭiḍe kāni
vunnadabu kŏnagoru vūm̐di nīdo navvĕnaṁṭā
yĕnnesi gaḍiṁchugŏne veḍasuddulayyā
(||ega||)
vesaḍa yemī ledu vĕm̐gĕmulāḍedi gādu
yīsadigi kām̐giḍinīyīvulegāni
āsala śhrīveṁkaḍeśha alayiṁchi kūḍĕnaṁṭā
vāsulela paṭṭevu varamu līvayyā