Egadamulo suddulu imdarimumdara nela

ఏకతములో సుద్దులు ఇందరిముందర నేల
Language

(॥పల్లవి॥)
ఏకతములో సుద్దులు ఇందరిముందర నేల
దీకొని రతులలోనే తెలుసుకోరాదా

(॥ఏక॥)
చెప్పరాని మాటలకు సిగ్గులు వడుటే గురి
అప్పటి నేలడిగేవు ఆపెను నీవు
దప్పిదేరే మోములోనే తలఁపెల్లఁ గానవచ్చీ
తెప్పలఁదేలి ముచ్చట తెలుసుకోరాదా

(॥ఏక॥)
సేయరాని సేఁతలకు సెలవినవ్వులే గురి
చాయల నేలొరసేవు సారెకు నీవు
కాయముపై కాఁకలనే కందువెల్లఁ గానవచ్చె
తీయనాయ వేడుకలు తెలుసుకోరాదా

(॥ఏక॥)
ముట్టరాని పనులకు మొక్కులు మొక్కుటే గురి
గుట్టులేల విచ్చేవు కొంకక నీవు
ఇట్టె కూడితిరి మీ యెమ్మెలెల్లఁగానవచ్చె
దిట్టవు శ్రీ వేంకటేశ తెలుసుకోరాదా

(||pallavi||)
egadamulo suddulu iṁdarimuṁdara nela
dīgŏni radulalone tĕlusugorādā

(||ega||)
sĕpparāni māḍalagu siggulu vaḍuḍe guri
appaḍi nelaḍigevu ābĕnu nīvu
dappidere momulone talam̐pĕllam̐ gānavachchī
tĕppalam̐deli muchchaḍa tĕlusugorādā

(||ega||)
seyarāni sem̐talagu sĕlavinavvule guri
sāyala nelŏrasevu sārĕgu nīvu
kāyamubai kām̐kalane kaṁduvĕllam̐ gānavachchĕ
tīyanāya veḍugalu tĕlusugorādā

(||ega||)
muṭṭarāni panulagu mŏkkulu mŏkkuḍe guri
guṭṭulela vichchevu kŏṁkaga nīvu
iṭṭĕ kūḍidiri mī yĕmmĕlĕllam̐gānavachchĕ
diṭṭavu śhrī veṁkaḍeśha tĕlusugorādā