ఏకతపు వేళ మీరెవ్వరుఁ బోకురమ్మా
(॥పల్లవి॥)
ఏకతపు వేళ మీరెవ్వరుఁ బోకురమ్మా
చీకాకు నెరులతో సిగ్గువడీ వాఁడే
(॥ఏక॥)
ముసిమి నధరపానమున మోవికెంపులు దేరి
కొనరుసంభోగముల కొప్పు జారి
వెస వీడుదోడావీడెములఁ బచ్చిదేరి
వుసురు నూరుపులతో నున్నాఁడు వీడే
(॥ఏక॥)
చిందరవందరలైన చెమటలఁ దొప్పఁదోఁగి
కందువ గోరి గురులు కడురాఁగి
గందపుఁగుచాలచొప్పు గట్టివురమున నాఁగి
పొందిన సింగారాల పొద్దుపుచ్చు వాఁడే
(॥ఏక॥)
తెల్లనికన్నుల మోముతేటలలో నోలలాడి
వెల్లవిరి నిందిరను వేడుకఁ గూడి
చల్లంగా బండాతుకూరి జనార్ధనుఁడై
యెల్లగా శ్రీవేంకటేశుఁ డిరవాయ వాఁడే
(||pallavi||)
egadabu veḽa mīrĕvvarum̐ bogurammā
sīgāgu nĕrulado sigguvaḍī vām̐ḍe
(||ega||)
musimi nadharabānamuna movigĕṁpulu deri
kŏnarusaṁbhogamula kŏppu jāri
vĕsa vīḍudoḍāvīḍĕmulam̐ bachchideri
vusuru nūrubulado nunnām̐ḍu vīḍe
(||ega||)
siṁdaravaṁdaralaina sĕmaḍalam̐ dŏppam̐dom̐gi
kaṁduva gori gurulu kaḍurām̐gi
gaṁdabum̐gusālasŏppu gaṭṭivuramuna nām̐gi
pŏṁdina siṁgārāla pŏddubuchchu vām̐ḍe
(||ega||)
tĕllanigannula momudeḍalalo nolalāḍi
vĕllaviri niṁdiranu veḍugam̐ gūḍi
sallaṁgā baṁḍādugūri janārdhanum̐ḍai
yĕllagā śhrīveṁkaḍeśhum̐ ḍiravāya vām̐ḍe