ఏకతపు మీచేఁత లిఁక నెట్టివో
(॥పల్లవి॥)
ఏకతపు మీచేఁత లిఁక నెట్టివో
జోకతో మీ సంతోసపు సొంపులెల్లాఁ గంటిమి
(॥ఏక॥)
తళుకుఁ జూపుల నీవు తప్పక చూడఁగాను
చెలియమోమున నిండీ చిరునవ్వులు
పలుకుఁ బంతాల వొడఁబడికలు నీకెట్టివో
తెలియవుగాని మీ పొందికలెల్లాఁ గంటిమి
(॥ఏక॥)
జఱసి సన్నలు నీవు సారెకునుఁ జేయఁగాను
మెఱసె బొమ్మజంకెన మెలుతకును
గుఱుతు లొండొరులకు గొనకొన్నవెట్టివో
యెఱఁగముగాని మీ ఇంపులెల్లాఁ గంటిమి
(॥ఏక॥)
సాదించి వచ్చి నీవు చనుఁగవ ముట్టఁగాను
ఆదిగొనె నివ్వెరగు లంగనకును
యాదెస శ్రీవేంకటేశ యెన్నికలు మీకెట్టివో
సోదించముగాని మీ సుద్దులెల్లాఁ గంటిమి
(||pallavi||)
egadabu mīsem̐ta lim̐ka nĕṭṭivo
jogado mī saṁtosabu sŏṁpulĕllām̐ gaṁṭimi
(||ega||)
taḽugum̐ jūbula nīvu tappaga sūḍam̐gānu
sĕliyamomuna niṁḍī sirunavvulu
palugum̐ baṁtāla vŏḍam̐baḍigalu nīgĕṭṭivo
tĕliyavugāni mī pŏṁdigalĕllām̐ gaṁṭimi
(||ega||)
jaṟasi sannalu nīvu sārĕgunum̐ jeyam̐gānu
mĕṟasĕ bŏmmajaṁkĕna mĕludagunu
guṟudu lŏṁḍŏrulagu gŏnagŏnnavĕṭṭivo
yĕṟam̐gamugāni mī iṁpulĕllām̐ gaṁṭimi
(||ega||)
sādiṁchi vachchi nīvu sanum̐gava muṭṭam̐gānu
ādigŏnĕ nivvĕragu laṁganagunu
yādĕsa śhrīveṁkaḍeśha yĕnnigalu mīgĕṭṭivo
sodiṁchamugāni mī suddulĕllām̐ gaṁṭimi