ఏకతానకుఁ బోరయ్య యిద్దరు మీరు
(॥పల్లవి॥)
ఏకతానకుఁ బోరయ్య యిద్దరు మీరు
మాకుఁ దెలియవు మీ తమకము లెట్టివో
(॥ఏక॥)
మారుకొని నీతోడ మాటలాడ నోపదు
కేరి కేరి బొమ్మల జంకించ నోపదు
సారె జరుఁజెమటతో చల్లేటినిట్టూర్పుతోడ
వూరకే వున్నది మీవొడఁబాటు లెట్టివో
(॥ఏక॥)
కొంగు పట్టి నిన్నుఁ దీసి కోపగించఁ జాలదు
కెంగేలిగోరఁ గన్నీరు గీఁట వొల్లదు
ముంగిట వెరగులతో మొక్కేటి చేతులతోడ
అంగన అదివో మీఅలవాటు లెట్టివో
(॥ఏక॥)
గక్కన నీకాఁగిటిలో గద్దించ నేరదు
వొక్కటై కూడితివి నిన్నొద్దన లేదు
యెక్కువ సంతోష్టముతో యిట్టె శ్రీవేంకటేశ
దక్కివున్న దాపె మీ తగులాయమిదివో
(||pallavi||)
egadānagum̐ borayya yiddaru mīru
māgum̐ dĕliyavu mī tamagamu lĕṭṭivo
(||ega||)
mārugŏni nīdoḍa māḍalāḍa nobadu
keri keri bŏmmala jaṁkiṁcha nobadu
sārĕ jarum̐jĕmaḍado salleḍiniṭṭūrbudoḍa
vūrage vunnadi mīvŏḍam̐bāḍu lĕṭṭivo
(||ega||)
kŏṁgu paṭṭi ninnum̐ dīsi kobagiṁcham̐ jāladu
kĕṁgeligoram̐ gannīru gīm̐ṭa vŏlladu
muṁgiḍa vĕragulado mŏkkeḍi seduladoḍa
aṁgana adivo mīalavāḍu lĕṭṭivo
(||ega||)
gakkana nīgām̐giḍilo gaddiṁcha neradu
vŏkkaḍai kūḍidivi ninnŏddana ledu
yĕkkuva saṁtoṣhṭamudo yiṭṭĕ śhrīveṁkaḍeśha
dakkivunna dābĕ mī tagulāyamidivo