Egadaanagu raaraadaa yeedanela keralevu

ఏకతానకు రారాదా యీడనేల కెరలేవు
Language

(॥పల్లవి॥)
ఏకతానకు రారాదా యీడనేల కెరలేవు
చేకొని వీడెమిచ్చితే సేసలు వెట్టేవు

(॥॥)
నవ్వుతా నీపై నేను నంటున గోరు మోపితే
రవ్వలు సేసేవింతలో రమణుఁడవు
పువ్వున వేసినవేటు బుజము నాఁటె నంటా
చివ్వన నేంటికి వద్డిచెలితోఁ జెప్పేవు

(॥॥)
చుట్టిరికానకు నీతో సొలసి వొడివట్టితే
పట్టిపెనఁగుచు నన్నుఁ బచ్చి సేసేవు
తిట్టిన తిట్టులు నీపై తీగెలువారె నంటా
వొట్టులు వెట్టుచు నేల వొలలు వేసేవు

(॥॥)
కడు వేడుకతో నిన్ను గాఁగిలించుకొంటేను
జడిగొని నా మోవి చవి చూచేవు
అడరి శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి
విడువక నన్ను నెంత వేఁడుకొనేవు

(||pallavi||)
egadānagu rārādā yīḍanela kĕralevu
segŏni vīḍĕmichchide sesalu vĕṭṭevu

(||||)
navvudā nībai nenu naṁṭuna goru mobide
ravvalu seseviṁtalo ramaṇum̐ḍavu
puvvuna vesinaveḍu bujamu nām̐ṭĕ naṁṭā
sivvana neṁṭigi vadḍisĕlidom̐ jĕppevu

(||||)
suṭṭirigānagu nīdo sŏlasi vŏḍivaṭṭide
paṭṭibĕnam̐gusu nannum̐ bachchi sesevu
tiṭṭina tiṭṭulu nībai tīgĕluvārĕ naṁṭā
vŏṭṭulu vĕṭṭusu nela vŏlalu vesevu

(||||)
kaḍu veḍugado ninnu gām̐giliṁchugŏṁṭenu
jaḍigŏni nā movi savi sūsevu
aḍari śhrīveṁkaḍeśha aṁtalo nannelidivi
viḍuvaga nannu nĕṁta vem̐ḍugŏnevu