Egadaana vunnavaamdu yidivo veemde

ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె
Language

(॥పల్లవి॥)
ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె
చేకొని మొక్కరో విూరు చేతులెత్తి యిపుడు

(॥ఏక॥)
మంచి మంచి పన్నీట మజ్జన మవధరించి
పంచమహవాద్యాలతో పరమాత్ముఁడు
అందలఁ గప్పురకాపు అంగముల మెత్తుకొని
కొంచక నిలుచున్నాఁడు గోణాముతోడను

(॥ఏక॥)
తట్టుపుణుఁ గామీఁద దట్టముగ నించుకొని
తెట్టలై వేదనాదాల దేవదేవుఁడు
గుట్టుతోడ సొమ్ములెల్లా గుచ్చి కుచ్చి కట్టుకొని
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను

(॥ఏక॥)
తనిసి యలమేల్మంగఁ దాళిగాఁ గట్టుకొనె
వెనుకొని యిదెవో శ్రీవేంకటేశుఁడు
మునుకొని యారగించి మూఁడులోకములుమెచ్చ
చనవరినసతులతో సరసమాడుతాను

(||pallavi||)
egadāna vunnavām̐ḍu yidivo vīm̐ḍĕ
segŏni mŏkkaro viూru sedulĕtti yibuḍu

(||ega||)
maṁchi maṁchi pannīḍa majjana mavadhariṁchi
paṁchamahavādyālado paramātmum̐ḍu
aṁdalam̐ gappuragābu aṁgamula mĕttugŏni
kŏṁchaga nilusunnām̐ḍu goṇāmudoḍanu

(||ega||)
taṭṭubuṇum̐ gāmīm̐da daṭṭamuga niṁchugŏni
tĕṭṭalai vedanādāla devadevum̐ḍu
guṭṭudoḍa sŏmmulĕllā guchchi kuchchi kaṭṭugŏni
vĕṭṭadīra suraṭla visariṁchugŏṁṭānu

(||ega||)
tanisi yalamelmaṁgam̐ dāḽigām̐ gaṭṭugŏnĕ
vĕnugŏni yidĕvo śhrīveṁkaḍeśhum̐ḍu
munugŏni yāragiṁchi mūm̐ḍulogamulumĕchcha
sanavarinasadulado sarasamāḍudānu