ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె
(॥పల్లవి॥)
ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె
చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు
(॥ఏకతాన॥)
మంచిమంచిపన్నీట మజ్జన మవధరించి
పంచమహవాద్యాలతో పరమాత్ముఁడు
అంచలఁ గప్పురకాపు అంగముల మెత్తికొని
కొంచక నిలుచున్నాఁడు గొణాముతోడను
(॥ఏకతాన॥)
తట్టుపుణుఁగామీఁద దట్టముగ నించుకొని
తెట్టెలై వేదనాదాల దేవదేవుఁడు
గుట్టుతోడ సొమ్ములెల్లా గుచ్చికుచ్చి కట్టుకొని
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను
(॥ఏకతాన॥)
తనిసి యలమేల్మంగఁ దాళిఁగా గట్టుకొనె
వెనుకొని యిదివో శ్రీవేంకటేశుఁడు
మునికొని యారగించి మూఁడులోకములు మెచ్చ
చనవరిసతులలో సరసమాడుతాను
(||pallavi||)
egadāna vunnavām̐ḍu yidivo vīm̐ḍĕ
segŏni mŏkkaro mīru sedulĕtti yibuḍu
(||egadāna||)
maṁchimaṁchibannīḍa majjana mavadhariṁchi
paṁchamahavādyālado paramātmum̐ḍu
aṁchalam̐ gappuragābu aṁgamula mĕttigŏni
kŏṁchaga nilusunnām̐ḍu gŏṇāmudoḍanu
(||egadāna||)
taṭṭubuṇum̐gāmīm̐da daṭṭamuga niṁchugŏni
tĕṭṭĕlai vedanādāla devadevum̐ḍu
guṭṭudoḍa sŏmmulĕllā guchchiguchchi kaṭṭugŏni
vĕṭṭadīra suraṭla visariṁchugŏṁṭānu
(||egadāna||)
tanisi yalamelmaṁgam̐ dāḽim̐gā gaṭṭugŏnĕ
vĕnugŏni yidivo śhrīveṁkaḍeśhum̐ḍu
munigŏni yāragiṁchi mūm̐ḍulogamulu mĕchcha
sanavarisadulalo sarasamāḍudānu