ఏకతాన నున్నవాడు యిందరికి మగఁడాయ
(॥పల్లవి॥)
ఏకతాన నున్నవాడు యిందరికి మగఁడాయ
చేకొందము చనవులు చేఁత లేమిసేసీనో
(॥ఏక॥)
విడెము చేతికియ్యరే విన్నపాలు సేయరే
వేడుకసంతోసాన విభుఁ డున్నాఁడు
కూడి సరనమాడరే గుబ్బలఁ గడునొత్తరే
యీడనే చూతము తా నిఁక నేమిసేసీనో
(॥ఏక॥)
పానుపు వరచరే బాసలు సేయించుకోరే
నానినమోహానఁ బతి నవ్వుచున్నాఁడు
మోనముతో మొక్కరే మోవితేనె లందుకోరే
తానకమై యీవేళ తా నేమి సేసీమో
(॥ఏక॥)
కొలువులు సేయరే గుఱుతెఱింగించుకోరే
యెలమి శ్రీవేంకటేశుఁ డేలుకొన్నాఁడు
పొలుపొందఁ జెనకరే పొత్తు గలపుకొనరే
మలసి పచ్చిసేతము మరి యేమిసేసీనో
(||pallavi||)
egadāna nunnavāḍu yiṁdarigi magam̐ḍāya
segŏṁdamu sanavulu sem̐ta lemisesīno
(||ega||)
viḍĕmu sedigiyyare vinnabālu seyare
veḍugasaṁtosāna vibhum̐ ḍunnām̐ḍu
kūḍi saranamāḍare gubbalam̐ gaḍunŏttare
yīḍane sūdamu tā nim̐ka nemisesīno
(||ega||)
pānubu varasare bāsalu seyiṁchugore
nāninamohānam̐ badi navvusunnām̐ḍu
monamudo mŏkkare movidenĕ laṁdugore
tānagamai yīveḽa tā nemi sesīmo
(||ega||)
kŏluvulu seyare guṟudĕṟiṁgiṁchugore
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍelugŏnnām̐ḍu
pŏlubŏṁdam̐ jĕnagare pŏttu galabugŏnare
malasi pachchisedamu mari yemisesīno