Egadaana nenimka nemisesinaam jelle

ఏకతాన నేనింక నేమిసేసినాఁ జెల్లె
Language

(॥పల్లవి॥)
ఏకతాన నేనింక నేమిసేసినాఁ జెల్లె
సాకిరివెట్టి నన్నిఁక సాదించఁగలదా

(॥ఏక॥)
పీఁటమీఁదఁ గూచుండి పెనువేలనే మొక్కె
ఆఁటదాని గర్వమెంత అదె చూడరే
మాటలు నేనాడిన మగిడి చూడదు తాను
నీటు నాతో నిటువలె నిలుపంగఁ గలదా

(॥ఏక॥)
మలగుపై నొరగుండి మారుమోముతో లేచె
చెలియ రాజసమెంత చేరిచూడరే
మలసి నే నవ్వినాను మచ్చికకు లోనుగాదు
చలము నాతోనింక సాదించఁగలదా

(॥ఏక॥)
గందము పూయుచునుండి కాఁగిలించుకొనె నన్ను
యిందుముఖితమి యెంత యిదె చూడరే
అంది శ్రీవెంకటేశుఁడ నలమేలుమంగ తాను
పందెమాడి నన్నుఁ గూడె బడి వాయఁగలదా

(||pallavi||)
egadāna neniṁka nemisesinām̐ jĕllĕ
sāgirivĕṭṭi nannim̐ka sādiṁcham̐galadā

(||ega||)
pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍi pĕnuvelane mŏkkĕ
ām̐ṭadāni garvamĕṁta adĕ sūḍare
māḍalu nenāḍina magiḍi sūḍadu tānu
nīḍu nādo niḍuvalĕ nilubaṁgam̐ galadā

(||ega||)
malagubai nŏraguṁḍi mārumomudo lesĕ
sĕliya rājasamĕṁta serisūḍare
malasi ne navvinānu machchigagu lonugādu
salamu nādoniṁka sādiṁcham̐galadā

(||ega||)
gaṁdamu pūyusunuṁḍi kām̐giliṁchugŏnĕ nannu
yiṁdumukhidami yĕṁta yidĕ sūḍare
aṁdi śhrīvĕṁkaḍeśhum̐ḍa nalamelumaṁga tānu
paṁdĕmāḍi nannum̐ gūḍĕ baḍi vāyam̐galadā