Egadaana neevu neevoo neriginabanu livi

ఏకటాన నీవు నీవూ నెరిగినపను లివి
Language

(॥పల్లవి॥)
ఏకటాన నీవు నీవూ నెరిగినపను లివి
యీకడ మాతోనేల యెరుక సేసేవు

(॥ఏక॥)
ప్రేమమున నాపె నిన్నుఁ బేరుకొని తిట్టితేను
నామోము చూచి యేల నవ్వేవు నీవు
చేముంచి యాపె నిన్నుఁ జెనకి పైకొంటేను
దీమసాన నేఁటి కానతిచ్చేవు నీవు

(॥ఏక॥)
చనవున నాపె నిన్ను సారెకు జంకించితేను
పెనఁగి సాకిరి యేల పెట్టేవు నన్ను
మనసిచ్చి యాపె నీతో మందటలాడితేను
చొనిపి నన్నేల నీవు చుట్టుకొనేవు

(॥ఏక॥)
గారవించి యాపె నిన్నుఁ గాఁగిలించుకొంటేను
చేరి నే నుందాననంటా సిగ్గువడేవు
యీరీతి శ్రీవేంకటేశ యీపె నిన్నుఁ గూడె నేఁడు
మీరతులు నాతోనేల మెచ్చవచ్చేవు

(||pallavi||)
egaḍāna nīvu nīvū nĕriginabanu livi
yīgaḍa mādonela yĕruga sesevu

(||ega||)
premamuna nābĕ ninnum̐ berugŏni tiṭṭidenu
nāmomu sūsi yela navvevu nīvu
semuṁchi yābĕ ninnum̐ jĕnagi paigŏṁṭenu
dīmasāna nem̐ṭi kānadichchevu nīvu

(||ega||)
sanavuna nābĕ ninnu sārĕgu jaṁkiṁchidenu
pĕnam̐gi sāgiri yela pĕṭṭevu nannu
manasichchi yābĕ nīdo maṁdaḍalāḍidenu
sŏnibi nannela nīvu suṭṭugŏnevu

(||ega||)
gāraviṁchi yābĕ ninnum̐ gām̐giliṁchugŏṁṭenu
seri ne nuṁdānanaṁṭā sigguvaḍevu
yīrīdi śhrīveṁkaḍeśha yībĕ ninnum̐ gūḍĕ nem̐ḍu
mīradulu nādonela mĕchchavachchevu