ఏకతాన నీవు నన్ను నేమి సేసినా మేలు
(॥పల్లవి॥)
ఏకతాన నీవు నన్ను నేమి సేసినా మేలు
కాకుసేసి కొలువులో కాఁకలఁ బెట్టకురా
(॥ఏక॥)
శిరసు ముడువఁగానే చెయివట్టి తీసేవు
దొరవైతే నౌదుగాని తొలరా నీవు
సరివారు నీవాడేసరసమౌతెరఁగరు
నెరులంటెనందురు నేనోపఁ జుమ్మీ
(॥ఏక॥)
సొమ్ములు నించుకోఁగానే సొలయుచుఁ దిట్టేవు
దొమ్మివాఁడవౌదుగాని తొలరా నీవు
నెమ్మది నీవు నాపై నెయ్యమౌతిదెరఁగరు
దిమ్ముల వాదులందురు తిద్దరాదు సుమ్మీ
(॥ఏక॥)
వల్లెవాటు వేసుకోఁగా వచ్చివచ్చి పెనఁగేవు
తొల్లేనీకు లోనైతి తొలరా నీవు
చెల్లురా శ్రీవెంకటేశ చెక్కునొక్కి కూడితివి
అల్లదివో గోరంటానందురు వొద్దు సుమ్మీ
(||pallavi||)
egadāna nīvu nannu nemi sesinā melu
kāgusesi kŏluvulo kām̐kalam̐ bĕṭṭagurā
(||ega||)
śhirasu muḍuvam̐gāne sĕyivaṭṭi tīsevu
dŏravaide naudugāni tŏlarā nīvu
sarivāru nīvāḍesarasamaudĕram̐garu
nĕrulaṁṭĕnaṁduru nenobam̐ jummī
(||ega||)
sŏmmulu niṁchugom̐gāne sŏlayusum̐ diṭṭevu
dŏmmivām̐ḍavaudugāni tŏlarā nīvu
nĕmmadi nīvu nābai nĕyyamaudidĕram̐garu
dimmula vādulaṁduru tiddarādu summī
(||ega||)
vallĕvāḍu vesugom̐gā vachchivachchi pĕnam̐gevu
tŏllenīgu lonaidi tŏlarā nīvu
sĕllurā śhrīvĕṁkaḍeśha sĕkkunŏkki kūḍidivi
alladivo goraṁṭānaṁduru vŏddu summī