Egadaana nee vumdu tevvam deṟumgu

ఏకతాన నీ వుండు టెవ్వఁ డెఱుఁగు
Language

(॥పల్లవి॥)
ఏకతాన నీ వుండు టెవ్వఁ డెఱుఁగు
ఆ కడ నీవే వచ్చేవని యంటా నుంటిని

(॥ఏక॥)
తెర వేసివుండఁగాను తిరిగివచ్చితి నేను
యిరవైన నీగుట్టు లెవ్వఁడెఱుఁగు
బెరసి నీకు నింతులు పెక్కు గలరు గనక
అరసి నీకు వేళగాదనియంటా నుంటిని

(॥ఏక॥)
పానుపుపై నీవుండఁగా పలుకకుండితి నేను
యీనెపాన నీ మన సెవ్వఁడెఱుఁగు
వీనుల నీ సుద్దులెల్లా వింటానుంటిమి గనక
పూని యింతులతో రతిఁబొందేవని వుంటిని

(॥ఏక॥)
చేతులు నీవు చాఁచఁగ సిగ్గుతోఁ దలవంచితి
యేతుల నీవలపులు యెవ్వఁడెఱుఁగు
యీతల శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
రాతిరి వచ్చేవంటా రాజసాన నుంటిని

(||pallavi||)
egadāna nī vuṁḍu ṭĕvvam̐ ḍĕṟum̐gu
ā kaḍa nīve vachchevani yaṁṭā nuṁṭini

(||ega||)
tĕra vesivuṁḍam̐gānu tirigivachchidi nenu
yiravaina nīguṭṭu lĕvvam̐ḍĕṟum̐gu
bĕrasi nīgu niṁtulu pĕkku galaru ganaga
arasi nīgu veḽagādaniyaṁṭā nuṁṭini

(||ega||)
pānububai nīvuṁḍam̐gā palugaguṁḍidi nenu
yīnĕbāna nī mana sĕvvam̐ḍĕṟum̐gu
vīnula nī suddulĕllā viṁṭānuṁṭimi ganaga
pūni yiṁtulado radim̐bŏṁdevani vuṁṭini

(||ega||)
sedulu nīvu sām̐sam̐ga siggudom̐ dalavaṁchidi
yedula nīvalabulu yĕvvam̐ḍĕṟum̐gu
yīdala śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
rādiri vachchevaṁṭā rājasāna nuṁṭini