ఏకతాన మీరుండఁగా ఇన్ని సింగారాలునాయ
(॥పల్లవి॥)
ఏకతాన మీరుండఁగా ఇన్ని సింగారాలునాయ
మేకొని చెలు లిందుకే మెచ్చేరు నిన్నును
(॥ఏక॥)
సకియనెమ్మోమునఁ జంద్రోదయఁబాయ
వెకలినవ్వులనె వెన్నెల గాసె
చికురభరము వీడి చీఁకటి యంతలో జారె
తొకుతొకులాడేరతుల నీవు గూడఁగా
(॥ఏక॥)
వన్నెమోవిచిగురున వసంతకాలము వచ్చె
చిన్నిపలుకులఁ బుట్టె చిగురలెల్లా
వున్నతపుఁగుచముల నొనరెఁ దమ్మి మొగ్గులు
కన్నె నురమున నీవు గాఁగిలించగాను
(॥ఏక॥)
మరుతేరు చూపట్టె మగువపిఱుఁదునను
సిరిమించెఁ గాళెలు చిఱుఁదొడల
యిరవై శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
గరిమల నీవిట్లాఁ గరుణించఁగాను
(||pallavi||)
egadāna mīruṁḍam̐gā inni siṁgārālunāya
megŏni sĕlu liṁduge mĕchcheru ninnunu
(||ega||)
sagiyanĕmmomunam̐ jaṁdrodayam̐bāya
vĕgalinavvulanĕ vĕnnĕla gāsĕ
sigurabharamu vīḍi sīm̐kaḍi yaṁtalo jārĕ
tŏgudŏgulāḍeradula nīvu gūḍam̐gā
(||ega||)
vannĕmovisiguruna vasaṁtagālamu vachchĕ
sinnibalugulam̐ buṭṭĕ siguralĕllā
vunnadabum̐gusamula nŏnarĕm̐ dammi mŏggulu
kannĕ nuramuna nīvu gām̐giliṁchagānu
(||ega||)
maruderu sūbaṭṭĕ maguvabiṟum̐dunanu
sirimiṁchĕm̐ gāḽĕlu siṟum̐dŏḍala
yiravai śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
garimala nīviṭlām̐ garuṇiṁcham̐gānu