ఏకతాన మీలో మీరు యేమి సేసుకొంటిరో
(॥పల్లవి॥)
ఏకతాన మీలో మీరు యేమి సేసుకొంటిరో
చేకొని మేమెఱఁగము చెప్పవయ్యా వినేము
(॥ఏక॥)
ఆకెకు వలచితివట అందరితో నాడుకొనీ
నీకు వేడుకా యిది నెయ్యపుమాట
ఆకుమడిచి చేతికినందినీవిచ్చితివట
నీకేల సిగ్గువడ నిజమా వోయీ
(॥ఏక॥)
వుంగర మిచ్చితివట వువిదలకెల్లఁ జూపీ
సంగడిఁ బొగడీ నీకు సంతోసమా
యెంగిలిమోవి గంటి సేయించుకొంటివట మాతో
అంగవించి యేమినవ్వే వౌనా వోయీ
(॥ఏక॥)
పాయకుండేనంటివట పచారించీఁ జెలులను
యేయెడ శ్రీవేంకటేశ యింపులా నీకు
యీయలమేల్ మంగపతి వేలితివి తన్నూనట
నాయిచ్చఁ గూడితి విది నమ్ముదునా వోయీ
(||pallavi||)
egadāna mīlo mīru yemi sesugŏṁṭiro
segŏni memĕṟam̐gamu sĕppavayyā vinemu
(||ega||)
āgĕgu valasidivaḍa aṁdarido nāḍugŏnī
nīgu veḍugā yidi nĕyyabumāḍa
āgumaḍisi sediginaṁdinīvichchidivaḍa
nīgela sigguvaḍa nijamā voyī
(||ega||)
vuṁgara michchidivaḍa vuvidalagĕllam̐ jūbī
saṁgaḍim̐ bŏgaḍī nīgu saṁtosamā
yĕṁgilimovi gaṁṭi seyiṁchugŏṁṭivaḍa mādo
aṁgaviṁchi yeminavve vaunā voyī
(||ega||)
pāyaguṁḍenaṁṭivaḍa pasāriṁchīm̐ jĕlulanu
yeyĕḍa śhrīveṁkaḍeśha yiṁpulā nīgu
yīyalamel maṁgabadi velidivi tannūnaḍa
nāyichcham̐ gūḍidi vidi nammudunā voyī