ఏకాత్మవాదులాల యిందు కేది వుత్తరము
(॥పల్లవి॥)
ఏకాత్మవాదులాల యిందు కేది వుత్తరము
మీకు లోకవిరోధ మేమిటఁ బాసీ నయ్యలాల
(॥ఏకా॥)
పాప మొక్కడు సేసితే పాపులే యిందరుఁ గావలదా
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా
కోపంచి యొక్కఁ డసురైతే కోరి యిందరుఁ గావలదా
చూప దేవుఁడొక్కఁడైతే సురలిందరుఁ గావలదా
(॥ఏకా॥)
వొకఁ డపవిత్రుఁ డైతే నొగి నిందరుఁ గావలదా
వొకఁడు శుచై వుండితే వోడ కిందరుఁ గావలదా
వొకని రతిసుఖమంటి యిందరును వొనరఁ బొందవలదా
వొకని దుఃఖ మందరు వూరఁ బంచుకోవలదా
(॥ఏకా॥)
ఆకడ నొకఁడు ముక్తుఁడయితే నందరునుఁ గావలదా
దీకొని యొకఁడు బంధుఁడయితే యిందరుఁ గావలదా
చేకొని శ్రీవేంకటేశుఁ జేరి దాసులయి యుండేటి-
లోకపు మునులనుఁ దెలుసుకోవలదా
(||pallavi||)
egātmavādulāla yiṁdu kedi vuttaramu
mīgu logavirodha memiḍam̐ bāsī nayyalāla
(||egā||)
pāba mŏkkaḍu seside pābule yiṁdarum̐ gāvaladā
yebuna vŏgaribuṇya miṁdarigi rāvaladā
kobaṁchi yŏkkam̐ ḍasuraide kori yiṁdarum̐ gāvaladā
sūba devum̐ḍŏkkam̐ḍaide suraliṁdarum̐ gāvaladā
(||egā||)
vŏgam̐ ḍabavitrum̐ ḍaide nŏgi niṁdarum̐ gāvaladā
vŏgam̐ḍu śhusai vuṁḍide voḍa kiṁdarum̐ gāvaladā
vŏgani radisukhamaṁṭi yiṁdarunu vŏnaram̐ bŏṁdavaladā
vŏgani duḥkha maṁdaru vūram̐ baṁchugovaladā
(||egā||)
āgaḍa nŏgam̐ḍu muktum̐ḍayide naṁdarunum̐ gāvaladā
dīgŏni yŏgam̐ḍu baṁdhum̐ḍayide yiṁdarum̐ gāvaladā
segŏni śhrīveṁkaḍeśhum̐ jeri dāsulayi yuṁḍeḍi-
logabu munulanum̐ dĕlusugovaladā