Egaamtamuloni suddu lennamdoo maṟavaraadu

ఏకాంతములోని సుద్దు లెన్నఁడూ మఱవరాదు
Language

(॥పల్లవి॥)
ఏకాంతములోని సుద్దు లెన్నఁడూ మఱవరాదు
యీ కడఁ జెలియ నీతో నేమని చెప్పుదుమే

(॥ఏకాం॥)
వీడిన నా తురుమున విరులు నిండా ముడిచె
వాడుదేర మోమున జవ్వాది సమరె
తోడనే చెక్కుచెమట దుడిచె కెంగేలను
యీడనే వోయమ్మ నీతో నేమని చెప్పుదునే

(॥ఏకాం॥)
నుదుటికస్తూరి బొట్టు నునుగోరనే దిద్దె
అదనఁ గప్పుర మిచ్చె నలపు వాయ
చెదరినహారముల చిక్కులెల్లా నెడలించె
యిది యెట్టికొత్తో నీతో నేమని చెప్పుదునే

(॥ఏకాం॥)
కోమలము నామేనంటాఁ కుంకుమ గందము పూసె
కామించి నేఁగోరినట్టె కరుణించెను
యీమేర శ్రీ వేంకటేశుఁ డిన్నిటాను చనవిచ్చె
యేమి సోద్యమో నీతో నేమని చెప్పుదునే

(||pallavi||)
egāṁtamuloni suddu lĕnnam̐ḍū maṟavarādu
yī kaḍam̐ jĕliya nīdo nemani sĕppudume

(||egāṁ||)
vīḍina nā turumuna virulu niṁḍā muḍisĕ
vāḍudera momuna javvādi samarĕ
toḍane sĕkkusĕmaḍa duḍisĕ kĕṁgelanu
yīḍane voyamma nīdo nemani sĕppudune

(||egāṁ||)
nuduḍigastūri bŏṭṭu nunugorane diddĕ
adanam̐ gappura michchĕ nalabu vāya
sĕdarinahāramula sikkulĕllā nĕḍaliṁchĕ
yidi yĕṭṭigŏtto nīdo nemani sĕppudune

(||egāṁ||)
komalamu nāmenaṁṭām̐ kuṁkuma gaṁdamu pūsĕ
kāmiṁchi nem̐gorinaṭṭĕ karuṇiṁchĕnu
yīmera śhrī veṁkaḍeśhum̐ ḍinniḍānu sanavichchĕ
yemi sodyamo nīdo nemani sĕppudune