ఏకాంతము గద్దు మన కిద్దరికిని
(॥పల్లవి॥)
ఏకాంతము గద్దు మన కిద్దరికిని
దాకొని యామేలు నీవు తలఁచుకోవయ్యా
(॥ఏకాం॥)
కోమలి పెట్టి పంపిన గురుతు కానిక నీకు
యీమరఁగున నిచ్చే నిటు రావయ్యా
నీమేనఁ గస్తూరి యిది నిండా నన్నే పూయి మనె
దీమసము నెరపక తెర వేయించవయ్యా
(॥ఏకాం॥)
వొట్టి తనమారు పాదా లొత్తుతా నన్నుండుమనె
పట్టె మంచము మీఁదఁ బండుండవయ్యా
జట్టిగా నీమోవిపండు చవి చూచి రమ్మనె
యెట్టిదో చూతము మొగ మెత్తఁ గదవయ్యా
(॥ఏకాం॥)
యెలయింపించె శ్రీవేంకటేశ నాచే నీదేవులు
అలమేల్మంగ మతక మంతా నయ్యా
అలరి కాఁగిలించితి మందుకేమి మెచ్చాయ
చలపట్ట కేలికసానిఁ గూడవయ్యా
(||pallavi||)
egāṁtamu gaddu mana kiddarigini
dāgŏni yāmelu nīvu talam̐sugovayyā
(||egāṁ||)
komali pĕṭṭi paṁpina gurudu kāniga nīgu
yīmaram̐guna nichche niḍu rāvayyā
nīmenam̐ gastūri yidi niṁḍā nanne pūyi manĕ
dīmasamu nĕrabaga tĕra veyiṁchavayyā
(||egāṁ||)
vŏṭṭi tanamāru pādā lŏttudā nannuṁḍumanĕ
paṭṭĕ maṁchamu mīm̐dam̐ baṁḍuṁḍavayyā
jaṭṭigā nīmovibaṁḍu savi sūsi rammanĕ
yĕṭṭido sūdamu mŏga mĕttam̐ gadavayyā
(||egāṁ||)
yĕlayiṁpiṁchĕ śhrīveṁkaḍeśha nāse nīdevulu
alamelmaṁga madaga maṁtā nayyā
alari kām̐giliṁchidi maṁdugemi mĕchchāya
salabaṭṭa keligasānim̐ gūḍavayyā