Egaamta midu dorage nimka nele vo vadine

ఏకాంత మిటు దొరకె నిఁక నేలే వో వదినె
Language

(॥పల్లవి॥)
ఏకాంత మిటు దొరకె నిఁక నేలే వో వదినె
పోకు వేమరు నీ కెడ వొద్దాయ వదినే

(॥ఏకాంత॥)
యిదె చూడు మాయిల్లు యీడనే వదినె
గుదిగొన్న యల పార్చుకొనఁగదవె వదినే
యెదిరించె మన వావు లెఱుఁగవా వదినె
తుదవలపు దిగఁదోయ దోసమే వదినే

(॥ఏకాంత॥)
యిద్దరికి నొక్కవయ సీడవునె వదినే
పెద్దరికమా యింత పెనఁగకువే వదినే
కొద్ది నీ వుంగరము గుఱుతు నాకేదే వదినే
బద్దులమాటలకుఁ బనిలేదే వదినే

(॥ఏకాంత॥)
నీ మనసుకొల దింక నే నెఱుఁగనే వదినె
కై మీరి కౌఁగిటికిఁ గలసితినె వదినే
యీమేర శ్రీవేంకటేశుఁ డనెవో వదినె
వేమరును నీవెంట విడువనే వదినే

(||pallavi||)
egāṁta miḍu dŏragĕ nim̐ka nele vo vadinĕ
pogu vemaru nī kĕḍa vŏddāya vadine

(||egāṁta||)
yidĕ sūḍu māyillu yīḍane vadinĕ
gudigŏnna yala pārsugŏnam̐gadavĕ vadine
yĕdiriṁchĕ mana vāvu lĕṟum̐gavā vadinĕ
tudavalabu digam̐doya dosame vadine

(||egāṁta||)
yiddarigi nŏkkavaya sīḍavunĕ vadine
pĕddarigamā yiṁta pĕnam̐gaguve vadine
kŏddi nī vuṁgaramu guṟudu nāgede vadine
baddulamāḍalagum̐ banilede vadine

(||egāṁta||)
nī manasugŏla diṁka ne nĕṟum̐gane vadinĕ
kai mīri kaum̐giḍigim̐ galasidinĕ vadine
yīmera śhrīveṁkaḍeśhum̐ ḍanĕvo vadinĕ
vemarunu nīvĕṁṭa viḍuvane vadine