ఈయఁగదవే వీడెమిప్పుడే నీ విభునికి
(॥పల్లవి॥)
ఈయఁగదవే వీడెమిప్పుడే నీ విభునికి
మీ యిచ్చలే గుఱిగాక మేమెల్లా గుఱే(ఱా?)
(॥ఈయ॥)
మొదలనాపెకు నీకు మోహమే గుఱిగాక
మదమునఁ జిమ్మి రేఁగే మంకులు గుఱా
పొదిగొన్న లోలోని భోగములే గుఱిగాక
పెదవులమీఁదటి బీరాలు గుఱా
(॥ఈయ॥)
ననుపున మీలోని నవ్వులే గుఱిగాక
వొనరఁ బెట్టుకొనిన వొట్లు గుఱా
కనుచూపులఁ జూచిన కాంక్షలే గుఱిగాక
కినిసిన బొమ్మల జంకెనలు గుఱా
(॥ఈయ॥)
కూడిన కాఁగిటిలోని కూటములే గుఱిగాక
పాడితోడ నొండొరుల పంతాలు గుఱా
యీడై శ్రీవేంకటేశుకిటు నీవే గుఱిగాక
వోడక మేనిపై రేకలుంటేనే గుఱా
(||pallavi||)
īyam̐gadave vīḍĕmippuḍe nī vibhunigi
mī yichchale guṟigāga memĕllā guṟe(ṟā?)
(||īya||)
mŏdalanābĕgu nīgu mohame guṟigāga
madamunam̐ jimmi rem̐ge maṁkulu guṟā
pŏdigŏnna loloni bhogamule guṟigāga
pĕdavulamīm̐daḍi bīrālu guṟā
(||īya||)
nanubuna mīloni navvule guṟigāga
vŏnaram̐ bĕṭṭugŏnina vŏṭlu guṟā
kanusūbulam̐ jūsina kāṁkṣhale guṟigāga
kinisina bŏmmala jaṁkĕnalu guṟā
(||īya||)
kūḍina kām̐giḍiloni kūḍamule guṟigāga
pāḍidoḍa nŏṁḍŏrula paṁtālu guṟā
yīḍai śhrīveṁkaḍeśhugiḍu nīve guṟigāga
voḍaga menibai regaluṁṭene guṟā