Eevela neemannana yinnesi kaligemgaa

ఈవేళ నీమన్నన యిన్నేసి కలిగెఁగా
Language

(॥పల్లవి॥)
ఈవేళ నీమన్నన యిన్నేసి కలిగెఁగా
కైవశమైతే నీమతి కరఁగీఁగాని

(॥ఈవే॥)
చీటికిమాటికి నీవు సిగ్గువడినా నీతో
మాటలాడఁ గలిగెఁనా మాపుదాఁకాను
చాటువగా నేఁ డప్పటి సరసమే చాలదా
కూటమిగలప్పటికిఁ గూడేవుగాని

(॥ఈవే॥)
భావము నీకెక్కడను పరాకైవుండినా నీకు
సేవసేయఁ గలిగెఁనా చేచేతను
వావులు దెలుపుచు నీవద్దనుండుటే చాలదా
యేవేళనైనా నీమోవి యిచ్చేవుగాని

(॥ఈవే॥)
యెవ్వతెకాఁగిట నీవు యెందుండినా నీతోను
నవ్వు నవ్వఁగలిగెఁగా ననుపుగాను
యివ్వల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
రవ్వగాఁ గూడితి విట్టే రక్షించేవుగాని

(||pallavi||)
īveḽa nīmannana yinnesi kaligĕm̐gā
kaivaśhamaide nīmadi karam̐gīm̐gāni

(||īve||)
sīḍigimāḍigi nīvu sigguvaḍinā nīdo
māḍalāḍam̐ galigĕm̐nā mābudām̐kānu
sāḍuvagā nem̐ ḍappaḍi sarasame sāladā
kūḍamigalappaḍigim̐ gūḍevugāni

(||īve||)
bhāvamu nīgĕkkaḍanu parāgaivuṁḍinā nīgu
sevaseyam̐ galigĕm̐nā sesedanu
vāvulu dĕlubusu nīvaddanuṁḍuḍe sāladā
yeveḽanainā nīmovi yichchevugāni

(||īve||)
yĕvvadĕgām̐giḍa nīvu yĕṁduṁḍinā nīdonu
navvu navvam̐galigĕm̐gā nanubugānu
yivvala śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
ravvagām̐ gūḍidi viṭṭe rakṣhiṁchevugāni