Eevala kaamtala gunaa legame kaavaa

ఈవల కాంతల గుణా లేకమే కావా
Language

(॥పల్లవి॥)
ఈవల కాంతల గుణా లేకమే కావా
పూవులవాటు కోపవు పూఁపవాటు కోపేవా

(॥॥)
కప్పురపు వీడెముతో కలికి మాటలాడఁగ
దప్పిదేరే వేఁటికోయి దగ్గరివుండి
చెప్పరానికారాలే చిందీ మాకన్నులను
యిప్పుడే నన్నుఁ జెనకే విందు కోపేనా

(॥॥)
చిగురుచేతుల నిన్నుఁ జెలియ విలువఁగానే
వొగరుఁజెమటలతో నుస్సురనేవు
మిగులవాఁడి మొనలు మెరిచీ మాచన్నులను
యెగువ నన్నుఁ బిలిచే విందు కోపేవా

(॥॥)
అద్దపు మెఱుఁగుఁజెక్కులాకె నిన్ను వలపించి
ముద్దుచూపితే భ్రమసి మోమువంచేవు
పొద్దుపొడపు గోళ్ళపొలఁతి నన్నుఁ గూడితి-
విద్దరికి శ్రీ వేంకటేశ వోపేవా

(||pallavi||)
īvala kāṁtala guṇā legame kāvā
pūvulavāḍu kobavu pūm̐pavāḍu kobevā

(||||)
kappurabu vīḍĕmudo kaligi māḍalāḍam̐ga
dappidere vem̐ṭigoyi daggarivuṁḍi
sĕpparānigārāle siṁdī māgannulanu
yippuḍe nannum̐ jĕnage viṁdu kobenā

(||||)
sigurusedula ninnum̐ jĕliya viluvam̐gāne
vŏgarum̐jĕmaḍalado nussuranevu
migulavām̐ḍi mŏnalu mĕrisī māsannulanu
yĕguva nannum̐ bilise viṁdu kobevā

(||||)
addabu mĕṟum̐gum̐jĕkkulāgĕ ninnu valabiṁchi
muddusūbide bhramasi momuvaṁchevu
pŏddubŏḍabu goḽḽabŏlam̐ti nannum̐ gūḍidi-
viddarigi śhrī veṁkaḍeśha vobevā