ఈసులు వాసులు మాకు నేల రేఁచేవు
(॥పల్లవి॥)
ఈసులు వాసులు మాకు నేల రేఁచేవు
నీ సూటికి రాని సేఁత నేము సేసేమా
(॥ఈసు॥)
ఆ రీతి కోపినవారు అలుగుదురింతే కాక
మారుకొని నే నీతో మచ్చరించేనా
పేరడి నీ కివి యెల్లాఁ బ్రియమైతే నౌఁగాక
మేరలు దప్పినపని మేము సేసేమా
(॥ఈసు॥)
ఱట్టడియైనవారు పట్టి బిగుతురుగాక
కట్టిడినై నే నీతో కాఁతాళించేనా
నట్టుకొట్టి నీకు నివి నవ్వులైతే నవుఁగాక
మెట్టిపట్టు కింతవని మేము సే సేమా
(॥ఈసు॥)
పలుకుఁ బంతాలవారు బలిమి సేతురు గాక
తొలుతనే నే నిన్ను దొమ్మి సే సేనా
యెలమి శ్రీ వేంకటేశ యెనసితి మిటు నీలో
మెలగుతా నింతవని మేము సే సేమా
(||pallavi||)
īsulu vāsulu māgu nela rem̐sevu
nī sūḍigi rāni sem̐ta nemu sesemā
(||īsu||)
ā rīdi kobinavāru aluguduriṁte kāga
mārugŏni ne nīdo machchariṁchenā
peraḍi nī kivi yĕllām̐ briyamaide naum̐gāga
meralu dappinabani memu sesemā
(||īsu||)
ṟaṭṭaḍiyainavāru paṭṭi bigudurugāga
kaṭṭiḍinai ne nīdo kām̐tāḽiṁchenā
naṭṭugŏṭṭi nīgu nivi navvulaide navum̐gāga
mĕṭṭibaṭṭu kiṁtavani memu se semā
(||īsu||)
palugum̐ baṁtālavāru balimi seduru gāga
tŏludane ne ninnu dŏmmi se senā
yĕlami śhrī veṁkaḍeśha yĕnasidi miḍu nīlo
mĕlagudā niṁtavani memu se semā