ఈశ్వరా నా భావ మిది యెట్టున్నదో నీ తలఁపు
(॥పల్లవి॥)
ఈశ్వరా నా భావ మిది యెట్టున్నదో నీ తలఁపు
శాశ్వతుఁడ నీ చిత్త మేసంగతో నా భాగ్యము
(॥ఈశ్వరా॥)
కతలలో నినుఁ జెప్పఁగా వినుటే కాని
క్షితి నెట్టివాఁడ వౌతా చేరి తెలియఁగ లేదు
గతి నీవు గలవనఁగా వెదకుదుఁ గాని
తతితోడ నీ మూర్తి దరిసించ లేదు
(॥ఈశ్వరా॥)
గంగ నీ తీర్థ మనఁగా మునిఁగి తేలు గాని
ముంగురులు నీ పాదము మోవఁగా మోపుట లేదు
అంగపు వేదము నీ మా టనఁగాఁ జదివెఁగాని
కంగున నీవు మాటాడఁగా వినుట లేదు
(॥ఈశ్వరా॥)
అల వైకుంఠము గల దనఁగాఁ గోరుట గాని
యిల నీ వేంకటాద్రిపై వలె మెలఁగుట లేదు
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలిగె నీ కృప నాకుఁ గడమ లేదు
(||pallavi||)
īśhvarā nā bhāva midi yĕṭṭunnado nī talam̐pu
śhāśhvadum̐ḍa nī sitta mesaṁgado nā bhāgyamu
(||īśhvarā||)
kadalalo ninum̐ jĕppam̐gā vinuḍe kāni
kṣhidi nĕṭṭivām̐ḍa vaudā seri tĕliyam̐ga ledu
gadi nīvu galavanam̐gā vĕdagudum̐ gāni
tadidoḍa nī mūrdi darisiṁcha ledu
(||īśhvarā||)
gaṁga nī tīrdha manam̐gā munim̐gi telu gāni
muṁgurulu nī pādamu movam̐gā mobuḍa ledu
aṁgabu vedamu nī mā ṭanam̐gām̐ jadivĕm̐gāni
kaṁguna nīvu māḍāḍam̐gā vinuḍa ledu
(||īśhvarā||)
ala vaiguṁṭhamu gala danam̐gām̐ goruḍa gāni
yila nī veṁkaḍādribai valĕ mĕlam̐guḍa ledu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kaligĕ nī kṛpa nāgum̐ gaḍama ledu