Eerum diyya benuvachchu nidiyemtide

ఈరుఁ దియ్య బేనువచ్చు నిదియేఁటిదే
Language

(॥పల్లవి॥)
ఈరుఁ దియ్య బేనువచ్చు నిదియేఁటిదే
సారెసారె నిది యేడ సంగరమోయమ్మా

(॥ఈరుఁ॥)
చూతమంటాఁ బిలిచితే చుట్టిరికాలే చెప్పీని
వాతెర విచ్చి యడుగవ స్తినా నేను
రాతి రేడనుంటివంటే రతికేల పిలిచీనే
పోతరీఁడు వీనికేల పొద్దువోదోయమ్మా

(॥ఈరుఁ॥)
మాఁటలాడఁ బిలిచితే మర్మము లేలంటీనే
వాఁటమైనతనుఁ జెనకవస్తినా నేను
యీటుకు వీడెమిచ్చితే నేల కొంగువట్టీనే
నేటిలోనే వీనికింత నీఁటు లేలోయమ్మా

(॥ఈరుఁ॥)
పందెమాడఁ బిలిచితే పచ్చినేసి నన్నుఁ గూడె
వందనతోఁ దన్ను ముట్టివ స్తినా నేను
అందగాఁడు శ్రీవేంకటాద్రీశుఁ డింతసేసె
పొంది పొరుగున నుంటే పోనీఁ డోయమ్మా

(||pallavi||)
īrum̐ diyya benuvachchu nidiyem̐ṭide
sārĕsārĕ nidi yeḍa saṁgaramoyammā

(||īrum̐||)
sūdamaṁṭām̐ biliside suṭṭirigāle sĕppīni
vādĕra vichchi yaḍugava stinā nenu
rādi reḍanuṁṭivaṁṭe radigela pilisīne
podarīm̐ḍu vīnigela pŏdduvodoyammā

(||īrum̐||)
mām̐ṭalāḍam̐ biliside marmamu lelaṁṭīne
vām̐ṭamainadanum̐ jĕnagavastinā nenu
yīḍugu vīḍĕmichchide nela kŏṁguvaṭṭīne
neḍilone vīnigiṁta nīm̐ṭu leloyammā

(||īrum̐||)
paṁdĕmāḍam̐ biliside pachchinesi nannum̐ gūḍĕ
vaṁdanadom̐ dannu muṭṭiva stinā nenu
aṁdagām̐ḍu śhrīveṁkaḍādrīśhum̐ ḍiṁtasesĕ
pŏṁdi pŏruguna nuṁṭe ponīm̐ ḍoyammā