ఈరు దియ్యఁ బేను వచ్చు నేమనఁగా నెట్లవునో
(॥పల్లవి॥)
ఈరు దియ్యఁ బేను వచ్చు నేమనఁగా నెట్లవునో
వూరకుండుటే చాలు వొద్దు సుమ్మీ బాసలు
(॥॥)
అడ్డమాడలేకపో అట్టె నేను నుస్సురంటి
వొడ్డారించఁగలేకే వొగి నవ్వితి
వెడ్డువెట్టి నన్నునేల వెడనిష్టూరిఁ జేసేవు
వొడ్డుకున్నాఁబోనీవు వోపఁజుమ్మీ యింతకు
(॥॥)
కోపగించఁ జాలకేపో కోరి వద్ద నిలుచుంటి
రాపుసేయఁజాలకేపో రమ్మంటిని
యీపనికిఁగానే నీవు యేల పచ్చిసేసేవు
దాఁపినా విచ్చివేసేవు తప్పఁ జమ్మీ నీకు
(॥॥)
వేరించఁజాలకే పో వేగమే కూడితి నిన్ను
ఆస చెరుచఁగలేకే అంకె నుంటిని
యీసరికి శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
వాసికెక్కె రతులెల్లా వలెఁజమ్మీ యిందుకు
(||pallavi||)
īru diyyam̐ benu vachchu nemanam̐gā nĕṭlavuno
vūraguṁḍuḍe sālu vŏddu summī bāsalu
(||||)
aḍḍamāḍalegabo aṭṭĕ nenu nussuraṁṭi
vŏḍḍāriṁcham̐galege vŏgi navvidi
vĕḍḍuvĕṭṭi nannunela vĕḍaniṣhṭūrim̐ jesevu
vŏḍḍugunnām̐bonīvu vobam̐jummī yiṁtagu
(||||)
kobagiṁcham̐ jālagebo kori vadda nilusuṁṭi
rābuseyam̐jālagebo rammaṁṭini
yībanigim̐gāne nīvu yela pachchisesevu
dām̐pinā vichchivesevu tappam̐ jammī nīgu
(||||)
veriṁcham̐jālage po vegame kūḍidi ninnu
āsa sĕrusam̐galege aṁkĕ nuṁṭini
yīsarigi śhrī veṁkaḍeśha nannu nelidivi
vāsigĕkkĕ radulĕllā valĕm̐jammī yiṁdugu