Eereedi valabu loga tinumadaaya vibhumda

ఈరీతి వలపు లొక టినుమడాయ విభుఁడ
Language

(॥పల్లవి॥)
ఈరీతి వలపు లొక టినుమడాయ విభుఁడ
కోరికలు గోటానఁగోటి సతికాయ

(॥ఈరీతి॥)
సుదతి నీ రాక కెదురుచూచేటి యాసలను
కదిసి నగుమో మెల్లఁ గన్ను లాయ
యిదె నీ కడకు నాకె యేతెంచు తమకమునే
ఆదనము నీ ముంగి లెల్లా నడుగులే యాయ

(॥ఈరీతి॥)
వెలఁది నీ సుద్దు లెల్ల వినియెడి వేడుకల
వెలలేనిపులకలే వీను లాయ
పలుమారు నీతోడి పలికేటి కాంక్షలను
నిలువెల్ల నంగనకు నివ్వెఱఁగు లాయ

(॥ఈరీతి॥)
కమలముఖి నిను రతులఁ గలయు నిబ్బరమునను
కొమరైన చన్నుఁగవ కొండ లాయ
చెమటనే నిద్దరికి శ్రీవేంకటేశ్వరుఁడ
తమకములు తనుపులును తడఁబా ట్లాయ

(||pallavi||)
īrīdi valabu lŏga ṭinumaḍāya vibhum̐ḍa
korigalu goḍānam̐goḍi sadigāya

(||īrīdi||)
sudadi nī rāga kĕdurusūseḍi yāsalanu
kadisi nagumo mĕllam̐ gannu lāya
yidĕ nī kaḍagu nāgĕ yedĕṁchu tamagamune
ādanamu nī muṁgi lĕllā naḍugule yāya

(||īrīdi||)
vĕlam̐di nī suddu lĕlla viniyĕḍi veḍugala
vĕlalenibulagale vīnu lāya
palumāru nīdoḍi paligeḍi kāṁkṣhalanu
niluvĕlla naṁganagu nivvĕṟam̐gu lāya

(||īrīdi||)
kamalamukhi ninu radulam̐ galayu nibbaramunanu
kŏmaraina sannum̐gava kŏṁḍa lāya
sĕmaḍane niddarigi śhrīveṁkaḍeśhvarum̐ḍa
tamagamulu tanubulunu taḍam̐bā ṭlāya