Eereedi dayavuttenaa inniyum joosi

ఈరీతి దయవుట్టెనా ఇన్నియుఁ జూచి
Language

(॥పల్లవి॥)
ఈరీతి దయవుట్టెనా ఇన్నియుఁ జూచి
కూరిమి నిండెనా మేలుగురుతులు చూచి

(॥॥)
చెప్పిన నామాటలు చెవిఁ బట్టెనా నీకు
ఇప్పుడైనా విరహపుటింతిఁ జూచి
తప్పులేని నీబాసలు తలఁచుకొంటివా నేఁడు
అప్పటి పానుపుమీఁది యలపులు చూచి

(॥॥)
అందిచ్చిన కానుకలన్నియు గనుపట్టెనా
పొందులకు నేఁకారేటి పొలఁతిఁ జూచి
సందడించే వలపులు సరి వచ్చెనా నీకు
డిందువడని యాసల దిష్టములు చూచి

(॥॥)
మచ్చిక నామొక్కులెల్ల మతికెక్కెనా నీకు
పచ్చిగా నిన్నుఁ గూడిన పడఁతిఁ జూచి
తచ్చి శ్రీవేంకటేశుఁడ తారుకాణాయనా నీకు
విచ్చనవిడి రతుల వేడుకలు చూచి

(||pallavi||)
īrīdi dayavuṭṭĕnā inniyum̐ jūsi
kūrimi niṁḍĕnā melugurudulu sūsi

(||||)
sĕppina nāmāḍalu sĕvim̐ baṭṭĕnā nīgu
ippuḍainā virahabuḍiṁtim̐ jūsi
tappuleni nībāsalu talam̐sugŏṁṭivā nem̐ḍu
appaḍi pānubumīm̐di yalabulu sūsi

(||||)
aṁdichchina kānugalanniyu ganubaṭṭĕnā
pŏṁdulagu nem̐kāreḍi pŏlam̐tim̐ jūsi
saṁdaḍiṁche valabulu sari vachchĕnā nīgu
ḍiṁduvaḍani yāsala diṣhṭamulu sūsi

(||||)
machchiga nāmŏkkulĕlla madigĕkkĕnā nīgu
pachchigā ninnum̐ gūḍina paḍam̐tim̐ jūsi
tachchi śhrīveṁkaḍeśhum̐ḍa tārugāṇāyanā nīgu
vichchanaviḍi radula veḍugalu sūsi