ఈఁతకు మిక్కిలి లోఁతా ఇంకా నేలే
(॥పల్లవి॥)
ఈఁతకు మిక్కిలి లోఁతా ఇంకా నేలే
చేఁతలెల్లాఁ జెల్లె నీకు చిరునవ్వుగాదా
(॥॥)
కాయ మతనిపై వేసి ఘనకుచముల రాసి
మాయలు సేతువుగాక మాతోనేలే
చాయలనే యెకపోసి సన్నల నింత సేసి
యేయెడకుఁ బోనీవు ఇంతకంటె నేమే
(॥॥)
మాటలనే కరఁగించి మంతనాలు మరిగించి
నాటక మక్కడఁ జేసి నాతో నీ కేలే
కాటుక కన్నులఁ జూచి కాఁకలఁ జేతులు చాఁచి
వాఁటమై వుండుదుగాక వాదు లీడనేలే
(॥॥)
కాఁగిట నాతనిఁగుచ్చి కమ్మి మాయింటికిఁదెచ్చి
ఆఁగితి నాకాఁగిటిలో నాయనాయనే
వీఁగక శ్రీవేంకటాద్రివిభుఁ డిట్టె నన్నుఁగూడె
పాఁగి యింతలోనే నన్నుఁ బంగించనేలే
(||pallavi||)
īm̐tagu mikkili lom̐tā iṁkā nele
sem̐talĕllām̐ jĕllĕ nīgu sirunavvugādā
(||||)
kāya madanibai vesi ghanagusamula rāsi
māyalu seduvugāga mādonele
sāyalane yĕgabosi sannala niṁta sesi
yeyĕḍagum̐ bonīvu iṁtagaṁṭĕ neme
(||||)
māḍalane karam̐giṁchi maṁtanālu marigiṁchi
nāḍaga makkaḍam̐ jesi nādo nī kele
kāḍuga kannulam̐ jūsi kām̐kalam̐ jedulu sām̐si
vām̐ṭamai vuṁḍudugāga vādu līḍanele
(||||)
kām̐giḍa nādanim̐guchchi kammi māyiṁṭigim̐dĕchchi
ām̐gidi nāgām̐giḍilo nāyanāyane
vīm̐gaga śhrīveṁkaḍādrivibhum̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
pām̐gi yiṁtalone nannum̐ baṁgiṁchanele