ఈఁతగాదు మోఁతగాదు ఇంతేలోతు మోహము
(॥పల్లవి॥)
ఈఁతగాదు మోఁతగాదు ఇంతేలోతు మోహము
చేఁతసేసి యిఁకనైనా చెక్కునొక్కవే
(॥ఈఁత॥)
వలపు పుక్కిటిబంటి వలిత విభునితోడ
మలసి సొలసి యిట్టె మాఁటలాడవో
చలము చంకలబంటి సరసము లాడితేను
కలసి మెలసి యిట్టె కాఁగిలించవే
(॥ఈఁత॥)
కోరికె పిక్కలబంటి కొంకుదేరవలసితే
యేరీతినైన నాతనింటి కేఁగవే
తారుకాఁ మొలబంటి దగ్గరఁబోయినప్పుడే
కూరిమితో తొడమీఁదఁ గూచుండవే
(॥ఈఁత॥)
పాయము రొమ్ములబంటి భావించి చూచితేను
ఆయెడ శ్రీ వేంకటేశు నటు గూడవే
ఆయము కుత్తిబంటి ఆతఁడిట్టె నిన్నుఁగూడె
మోయుచు మదనమంత్రములు వినిపించవే
(||pallavi||)
īm̐tagādu mom̐tagādu iṁtelodu mohamu
sem̐tasesi yim̐kanainā sĕkkunŏkkave
(||īm̐ta||)
valabu pukkiḍibaṁṭi valida vibhunidoḍa
malasi sŏlasi yiṭṭĕ mām̐ṭalāḍavo
salamu saṁkalabaṁṭi sarasamu lāḍidenu
kalasi mĕlasi yiṭṭĕ kām̐giliṁchave
(||īm̐ta||)
korigĕ pikkalabaṁṭi kŏṁkuderavalaside
yerīdinaina nādaniṁṭi kem̐gave
tārugām̐ mŏlabaṁṭi daggaram̐boyinappuḍe
kūrimido tŏḍamīm̐dam̐ gūsuṁḍave
(||īm̐ta||)
pāyamu rŏmmulabaṁṭi bhāviṁchi sūsidenu
āyĕḍa śhrī veṁkaḍeśhu naḍu gūḍave
āyamu kuttibaṁṭi ādam̐ḍiṭṭĕ ninnum̐gūḍĕ
moyusu madanamaṁtramulu vinibiṁchave