ఈఁదుక రమ్మనవే యిటు నన్నుఁ జూచుఁగాని
(॥పల్లవి॥)
ఈఁదుక రమ్మనవే యిటు నన్నుఁ జూచుఁగాని
యీఁదాడంటేఁ గోదాఁడనే యెడమాట లేఁటికి
(॥॥)
వలవు లీఁతలబంటి వడి నాకు నైతేను
తలపోఁతలకునైతే తలబంటి
కలువల కైతేను కామువింటి తెగబంటి
చిలుకల కెల్లాను మచ్చికఁ బుక్కిళ్లబంటి
(॥॥)
పాయము మోపులకొద్ది పైపై నా కైతేను
కాయపుగుబ్బలకైతే గంపలకొద్ది
చాయ వెన్నెలలకైతే చంద్రుడు గాసినకొద్ది
కోయిలలకై తేను కుత్తిక కొద్ది
(॥॥)
సారమైనవేడుకలు సందెఁడేసి నాకై తేను
కోరికలకైతేను గుంపెఁడేసి
యీరీతి శ్రీ వేంకటేశుఁ డిట్టెవచ్చి నన్నుఁ గూడె
శేరికల నోరిరోద చెప్పఁ జేటఁ డేసి
(||pallavi||)
īm̐duga rammanave yiḍu nannum̐ jūsum̐gāni
yīm̐dāḍaṁṭem̐ godām̐ḍane yĕḍamāḍa lem̐ṭigi
(||||)
valavu līm̐talabaṁṭi vaḍi nāgu naidenu
talabom̐talagunaide talabaṁṭi
kaluvala kaidenu kāmuviṁṭi tĕgabaṁṭi
silugala kĕllānu machchigam̐ bukkiḽlabaṁṭi
(||||)
pāyamu mobulagŏddi paibai nā kaidenu
kāyabugubbalagaide gaṁpalagŏddi
sāya vĕnnĕlalagaide saṁdruḍu gāsinagŏddi
koyilalagai tenu kuttiga kŏddi
(||||)
sāramainaveḍugalu saṁdĕm̐ḍesi nāgai tenu
korigalagaidenu guṁpĕm̐ḍesi
yīrīdi śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕvachchi nannum̐ gūḍĕ
śherigala noriroda sĕppam̐ jeḍam̐ ḍesi