ఈకెసంది నీసంది నెరవున్నదా
(॥పల్లవి॥)
ఈకెసంది నీసంది నెరవున్నదా
చేకొన్నదాఁకా గుట్టుసేసీ నింతేకాక
(॥ఈకె॥)
చెలినేలినవాఁడవు చెఱఁగువట్టఁగరాదా
కొలువులో సిగ్గుగాఁ గొంకీంగాక
తలఁపు నీ వడుగఁగాఁ దగ విన్నవించరాదా
మలసి పరవశము మైమఱచీఁగాక
(॥ఈకె॥)
నీవు వసంతమాడంగా నీపై మారు చల్లరాదా
సోవల సాదుఁదనము చూపీఁగాక
పూవుల నీవు వేయఁగా పొంచి పట్టుకొనరాదా
ఆవల మరుబాణాలని మానెఁగాక
(॥ఈకె॥)
వొట్టి రతివేళ నీకె నురమెక్కించుకోరాదా
ముట్టి దోసము గాకుండా మొక్కీఁగాక
అట్టె శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
గట్టిగా నీ యిచ్చెరిఁగి కాంగిలించీఁగాక
(||pallavi||)
īgĕsaṁdi nīsaṁdi nĕravunnadā
segŏnnadām̐kā guṭṭusesī niṁtegāga
(||īgĕ||)
sĕlinelinavām̐ḍavu sĕṟam̐guvaṭṭam̐garādā
kŏluvulo siggugām̐ gŏṁkīṁgāga
talam̐pu nī vaḍugam̐gām̐ daga vinnaviṁcharādā
malasi paravaśhamu maimaṟasīm̐gāga
(||īgĕ||)
nīvu vasaṁtamāḍaṁgā nībai māru sallarādā
sovala sādum̐danamu sūbīm̐gāga
pūvula nīvu veyam̐gā pŏṁchi paṭṭugŏnarādā
āvala marubāṇālani mānĕm̐gāga
(||īgĕ||)
vŏṭṭi radiveḽa nīgĕ nuramĕkkiṁchugorādā
muṭṭi dosamu gāguṁḍā mŏkkīm̐gāga
aṭṭĕ śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
gaṭṭigā nī yichchĕrim̐gi kāṁgiliṁchīm̐gāga