ఈకెను నీకు నింకా నేమి ప్రియము
(॥పల్లవి॥)
ఈకెను నీకు నింకా నేమి ప్రియము
కైకొను మిందులో నీకుఁ గలవెల్లాఁ బ్రియము
(॥ఈకె॥)
తగులైన రతులకు తలపోఁతలే ప్రియము
నగవుఁ జూపులకు సన్నలే ప్రియము
తెగని కోరికెలకు తియ్యమోవులే ప్రియము
పలుకుఁ జేఁతలకును పలుకులే ప్రియము
(॥ఈకె॥)
జట్టి గొన్నమోహాలకు సరసములే ప్రియము
చుట్టరికములకు మెచులే ప్రియము
నెట్టుకొన్న యాసలకు నిలుకడలే ప్రియము
గట్టియైనపొందులకు గర్వములే ప్రియము
(॥ఈకె॥)
మంతనాన నున్నందుకు మందె మేళాలే ప్రియము
పొంతనేరుపులకు నోర్పులే ప్రియము
ఇంతట శ్రీ వేంకటేశ యేలితివి చెలియను
సంతతపు కూటమికి చనవులే ప్రియము
(||pallavi||)
īgĕnu nīgu niṁkā nemi priyamu
kaigŏnu miṁdulo nīgum̐ galavĕllām̐ briyamu
(||īgĕ||)
tagulaina radulagu talabom̐tale priyamu
nagavum̐ jūbulagu sannale priyamu
tĕgani korigĕlagu tiyyamovule priyamu
palugum̐ jem̐talagunu palugule priyamu
(||īgĕ||)
jaṭṭi gŏnnamohālagu sarasamule priyamu
suṭṭarigamulagu mĕsule priyamu
nĕṭṭugŏnna yāsalagu nilugaḍale priyamu
gaṭṭiyainabŏṁdulagu garvamule priyamu
(||īgĕ||)
maṁtanāna nunnaṁdugu maṁdĕ meḽāle priyamu
pŏṁtanerubulagu norbule priyamu
iṁtaḍa śhrī veṁkaḍeśha yelidivi sĕliyanu
saṁtadabu kūḍamigi sanavule priyamu