ఈకెకు నప్పుడుగాని యేకచిత్తము గాదు
(॥పల్లవి॥)
ఈకెకు నప్పుడుగాని యేకచిత్తము గాదు
చేకొని మచ్చిక చూపి చెప్పవయ్య ప్రియము
(॥॥)
కళలు దొలఁకఁగాను గక్కన నీ మోము చూచి
మలసి యెందో కొడిమలుగట్టీని
తలకొని నీ వెంత తారుకాణించవచ్చినా
చెలియ నమ్మదు ఇఁకఁ జేయవయ్య బాస
(॥॥)
పంకంపుఁజెమట మేనిపై నీకు నుండఁగాను
తెంకి నేడదోయని సందేహించీని
అంకెల నొడఁబరచి అతివ కెంతచెప్పినా
కొంకక మానదు పెట్టుకొనవయ్య ఆసలు
(॥॥)
సతమై నిట్టూర్పులు సారె నీకు రేఁగితేను
సతులఁ బొందితివని జరసీ నిన్ను
ఇతవుగా శ్రీ వేంకటేశ యీకెఁ గూడితివి
రతిలోనే సోదించి నేరపవయ్య నిజము
(||pallavi||)
īgĕgu nappuḍugāni yegasittamu gādu
segŏni machchiga sūbi sĕppavayya priyamu
(||||)
kaḽalu dŏlam̐kam̐gānu gakkana nī momu sūsi
malasi yĕṁdo kŏḍimalugaṭṭīni
talagŏni nī vĕṁta tārugāṇiṁchavachchinā
sĕliya nammadu im̐kam̐ jeyavayya bāsa
(||||)
paṁkaṁpum̐jĕmaḍa menibai nīgu nuṁḍam̐gānu
tĕṁki neḍadoyani saṁdehiṁchīni
aṁkĕla nŏḍam̐barasi adiva kĕṁtasĕppinā
kŏṁkaga mānadu pĕṭṭugŏnavayya āsalu
(||||)
sadamai niṭṭūrbulu sārĕ nīgu rem̐gidenu
sadulam̐ bŏṁdidivani jarasī ninnu
idavugā śhrī veṁkaḍeśha yīgĕm̐ gūḍidivi
radilone sodiṁchi nerabavayya nijamu