ఈకె యెంత చనవరో యేకతాన నింతసేసె
(॥పల్లవి॥)
ఈకె యెంత చనవరో యేకతాన నింతసేసె
లాకలుగా వారు నవ్వి లలి నొక్కటైరి
(॥ఈకె॥)
అలిగా వొక్కరొక్కరు అటుమోములై వుండఁగా
వెలయఁజెప్పె బుద్దులు వినకుండఁగా
చెలివలువలు దీసి సిగ్గునఁ దలుపులు మూసి
వెలి నిలుచుండీతేను వింతతిట్టు దిట్టిరి
(॥ఈకె॥)
బాగాలు నోళ్లఁబోసి బలిమి నాకు మడిచి
ఆగతి నిడీ నప్పటి నట్టె వుండఁగా
చేఁగదేరఁ గాఁగిళ్లకు చేతులు చక్కఁగా దొబ్బి
బాగుగఁ దెరవేసితేఁ బచ్చితిట్టు దిట్టిరి
(॥ఈకె॥)
శ్రీవేంకటేశ్వరు నింతిఁ జేరి మర్మా లంటించి
ఆవేళవారివలువ లట్టె కప్పఁగా
దేవుఁడు దేవులుఁ గూడి తెఱవను మెచ్చి మెచ్చి
వేవేలిచ్చి మన్నించి వేరేతిట్టు దిట్టిరి
(||pallavi||)
īgĕ yĕṁta sanavaro yegadāna niṁtasesĕ
lāgalugā vāru navvi lali nŏkkaḍairi
(||īgĕ||)
aligā vŏkkarŏkkaru aḍumomulai vuṁḍam̐gā
vĕlayam̐jĕppĕ buddulu vinaguṁḍam̐gā
sĕlivaluvalu dīsi siggunam̐ dalubulu mūsi
vĕli nilusuṁḍīdenu viṁtadiṭṭu diṭṭiri
(||īgĕ||)
bāgālu noḽlam̐bosi balimi nāgu maḍisi
āgadi niḍī nappaḍi naṭṭĕ vuṁḍam̐gā
sem̐gaderam̐ gām̐giḽlagu sedulu sakkam̐gā dŏbbi
bāgugam̐ dĕravesidem̐ bachchidiṭṭu diṭṭiri
(||īgĕ||)
śhrīveṁkaḍeśhvaru niṁtim̐ jeri marmā laṁṭiṁchi
āveḽavārivaluva laṭṭĕ kappam̐gā
devum̐ḍu devulum̐ gūḍi tĕṟavanu mĕchchi mĕchchi
vevelichchi manniṁchi verediṭṭu diṭṭiri