Eege tolli neegu moga merimginadi gaambolu

ఈకె తొల్లి నీకు మొక మెరిఁగినది గాఁబోలు
Language

(॥పల్లవి॥)
ఈకె తొల్లి నీకు మొక మెరిఁగినది గాఁబోలు
వాకిటికి వచ్చె నీవు వలపించుకోవయ్యా

(॥ప్లలవి॥)
సళుపుఁ జూపులు నీపైఁ జల్లుకొంటా మదిరాక్షి
నిలుచున్న దిదిగొ నీ యెదుట
పిలువని పేరఁటము పెండ్లిబండి యెక్కవచ్చె
తిలకించి చూడవయ్యా దిష్టించి నీవు

(॥ఈకె॥)
చీటికిమాటికి నీతో చిరునవ్వు నవ్వుకొంటా
మాటలాడీ నిదిగో మందె మేళాన
పోటి గరితె తనాన బువ్వము గలయవచ్చె
చోటిచ్చి తొడపైఁ బెట్టి సుద్దు లడుగవయ్యా

(॥ఈకె॥)
సారెకు శ్రీవేంకటేశ చన్నుల నొరసుకొంటా
గోర నూఁదీ నిదిగో కూడితివంటా
పోరచి చుట్టమై నీచేఁ బోఁక వెట్టించుకోవచ్చె
బార చాఁచి కాఁగిలించి పక్కఁబెట్టుకోవయ్యా

(||pallavi||)
īgĕ tŏlli nīgu mŏga mĕrim̐ginadi gām̐bolu
vāgiḍigi vachchĕ nīvu valabiṁchugovayyā

(||plalavi||)
saḽubum̐ jūbulu nībaim̐ jallugŏṁṭā madirākṣhi
nilusunna didigŏ nī yĕduḍa
piluvani peram̐ṭamu pĕṁḍlibaṁḍi yĕkkavachchĕ
tilagiṁchi sūḍavayyā diṣhṭiṁchi nīvu

(||īgĕ||)
sīḍigimāḍigi nīdo sirunavvu navvugŏṁṭā
māḍalāḍī nidigo maṁdĕ meḽāna
poḍi garidĕ tanāna buvvamu galayavachchĕ
soḍichchi tŏḍabaim̐ bĕṭṭi suddu laḍugavayyā

(||īgĕ||)
sārĕgu śhrīveṁkaḍeśha sannula nŏrasugŏṁṭā
gora nūm̐dī nidigo kūḍidivaṁṭā
porasi suṭṭamai nīsem̐ bom̐ka vĕṭṭiṁchugovachchĕ
bāra sām̐si kām̐giliṁchi pakkam̐bĕṭṭugovayyā