Eege nettu dagilidi vimtulellaa numdamgaanu

ఈకె నెట్టు దగిలితి వింతులెల్లా నుండఁగాను
Language

(॥పల్లవి॥)
ఈకె నెట్టు దగిలితి వింతులెల్లా నుండఁగాను
నీకంటె మూరెఁ డెక్కుడు నీటుఁదనములను

(॥ఈకె॥)
చెక్కుటద్దములు చూపి చెలి నిన్ను నెలఇంచె
జక్కవ చన్నులు చూపి చల్లె వలపు
నిక్కుఁ గొప్పు చూపి కొంత నీ మనసు గరఁగించె
ఇక్కువలంట్టి తమక మింకా నెంత రేఁచునో

(॥ఈకె॥)
సెలవుల నవ్వు నవ్వి సిగ్గులెల్లా విడిపించె
సొలపుఁ జూపులఁ జూచి చొక్కించెను
వెలయఁగొన గోరూఁది వేడుకలు పుట్టించె
మలసి కాఁగిటఁ గూచ్చి మరి యెంత సేసునో

(॥ఈకె॥)
కరములు పైఁ జాఁచి కళ లుప్పతిలఁజేసె
సరుసనే మోవి చూపి చవులు నించె
యెరవులేక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
యిరవయి తానూఁ గూడి యిట్టె యెంత సేసునో

(||pallavi||)
īgĕ nĕṭṭu dagilidi viṁtulĕllā nuṁḍam̐gānu
nīgaṁṭĕ mūrĕm̐ ḍĕkkuḍu nīḍum̐danamulanu

(||īgĕ||)
sĕkkuḍaddamulu sūbi sĕli ninnu nĕla̮iṁchĕ
jakkava sannulu sūbi sallĕ valabu
nikkum̐ gŏppu sūbi kŏṁta nī manasu garam̐giṁchĕ
ikkuvalaṁṭṭi tamaga miṁkā nĕṁta rem̐suno

(||īgĕ||)
sĕlavula navvu navvi siggulĕllā viḍibiṁchĕ
sŏlabum̐ jūbulam̐ jūsi sŏkkiṁchĕnu
vĕlayam̐gŏna gorūm̐di veḍugalu puṭṭiṁchĕ
malasi kām̐giḍam̐ gūchchi mari yĕṁta sesuno

(||īgĕ||)
karamulu paim̐ jām̐si kaḽa luppadilam̐jesĕ
sarusane movi sūbi savulu niṁchĕ
yĕravulega śhrīveṁkaḍeśha nannu nelidivi
yiravayi tānūm̐ gūḍi yiṭṭĕ yĕṁta sesuno