Eege nemoo devullamai yitte nee kumdemugaaga

ఈకె నేమూ దేవుళ్ళమై యిట్టె నీ కుండేముగాక
Language

(॥పల్లవి॥)
ఈకె నేమూ దేవుళ్ళమై యిట్టె నీ కుండేముగాక
మాకు సమ్మతములాయ మరి యేఁటిసుద్దులు

(॥ఈకె॥)
ముచ్చటలెల్లా నాడె మోహమున జవరాలు
ఇచ్చకము సేసె నీవూ నియ్యకొంటివి
విచ్చనవిళ్ళాయ మీకు వేడుకలు సమకూడె
మచ్చికాయ మాపుదాఁకా మరియేఁటి సుద్దులు

(॥ఈకె॥)
తెలిగన్నులనుఁ జూచె తియ్యనిమోవి చూపె
కలకల నవ్వె నీవూ గైకొంటివి
తలఁపులు సరివచ్చె తనిసె మీమనసులు
మలసె సంతోసాలు మరియేఁటిసుద్దులు

(॥ఈకె॥)
వుదుటగుబ్బల నూఁదె వొరసె నిన్నుఁ జెనకె
కదిసెఁ గాఁగిట నీవూఁ గానిమ్మంటివి
ఇదివొ శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
మదిమది నున్నారము మరి యేఁటిసుద్దులు

(||pallavi||)
īgĕ nemū devuḽḽamai yiṭṭĕ nī kuṁḍemugāga
māgu sammadamulāya mari yem̐ṭisuddulu

(||īgĕ||)
muchchaḍalĕllā nāḍĕ mohamuna javarālu
ichchagamu sesĕ nīvū niyyagŏṁṭivi
vichchanaviḽḽāya mīgu veḍugalu samagūḍĕ
machchigāya mābudām̐kā mariyem̐ṭi suddulu

(||īgĕ||)
tĕligannulanum̐ jūsĕ tiyyanimovi sūbĕ
kalagala navvĕ nīvū gaigŏṁṭivi
talam̐pulu sarivachchĕ tanisĕ mīmanasulu
malasĕ saṁtosālu mariyem̐ṭisuddulu

(||īgĕ||)
vuduḍagubbala nūm̐dĕ vŏrasĕ ninnum̐ jĕnagĕ
kadisĕm̐ gām̐giḍa nīvūm̐ gānimmaṁṭivi
idivŏ śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
madimadi nunnāramu mari yem̐ṭisuddulu