Eege nela pommanevu yimtilonigi

ఈకె నేల పొమ్మనేవు యింటిలోనికి
Language

(॥పల్లవి॥)
ఈకె నేల పొమ్మనేవు యింటిలోనికి
నీకు గాఁను కట్టెదుట నిలుచుండుఁగాక

(॥ఈకె॥)
వూడిగము సేసేచెలి నొద్దనఁగ వచ్చునా
వేడుక గలంతఁ జేసి వెలయుఁ గాక
నీడనుండి యందులకు నింద నీపై వేసీనా
వాడికై నదాఁకాను వలపించుఁ గాక

(॥ఈకె॥)
మంతనమాడేదాని మాను మనవచ్చునా
సంతసుద్దు లెల్లాఁ జెప్పి జరయుఁ గాక
వింతలుగా ని న్నిందుకు వెంగేలు ని న్నాడీనా
చింతవాయఁ జెనకుతా చిమ్మి రేఁచుఁ గాక

(॥ఈకె॥)
పానుపుపై నున్నదాని బడివాప వచ్చునా
మేను చెమరించఁ జేసి మెఱయుఁ గాక
వూని శ్రీవేంకటేశ్వర పొందితి వాకెను నన్ను
తా నిన్ను రతులచేఁ దనియంచుఁ గాకా

(||pallavi||)
īgĕ nela pŏmmanevu yiṁṭilonigi
nīgu gām̐nu kaṭṭĕduḍa nilusuṁḍum̐gāga

(||īgĕ||)
vūḍigamu sesesĕli nŏddanam̐ga vachchunā
veḍuga galaṁtam̐ jesi vĕlayum̐ gāga
nīḍanuṁḍi yaṁdulagu niṁda nībai vesīnā
vāḍigai nadām̐kānu valabiṁchum̐ gāga

(||īgĕ||)
maṁtanamāḍedāni mānu manavachchunā
saṁtasuddu lĕllām̐ jĕppi jarayum̐ gāga
viṁtalugā ni nniṁdugu vĕṁgelu ni nnāḍīnā
siṁtavāyam̐ jĕnagudā simmi rem̐sum̐ gāga

(||īgĕ||)
pānububai nunnadāni baḍivāba vachchunā
menu sĕmariṁcham̐ jesi mĕṟayum̐ gāga
vūni śhrīveṁkaḍeśhvara pŏṁdidi vāgĕnu nannu
tā ninnu radulasem̐ daniyaṁchum̐ gāgā