Eege neegu valasunu innidaa jaanavu neevu

ఈకె నీకు వలచును ఇన్నిటా జాణవు నీవు
Language

(॥పల్లవి॥)
ఈకె నీకు వలచును ఇన్నిటా జాణవు నీవు
కైకొన్న మీ వేడుకల కందువలే మంచివి

(॥ఈకె॥)
సలిగెగల సతులు జంకింతురు సొలతురు
యెలమిఁ బతికి నెగ్గు లెంచఁగరాదు
తలఁపులుఁ దలఁపులు తారుకాణలై యుండితే
మొలకనవ్వులతోడి మోనములే మంచివి

(॥ఈకె॥)
ప్రేమము గలుగువారు బిగుతురు గుంపింతురు
యేమైనా నందు కెగ్గు లెంచఁగరాదు
మోము మోముఁ జాచుకొంటే మొగమోట లుప్పతిలు
దీమసముతోడి తరితీపులే మంచివి

(॥ఈకె॥)
సంతమైన చుట్టములు సాదింతురు బోదింతురు
ఇతవులేకాని యెగ్గు లెంచఁగరాదు
తతితో శ్రీవేంకటేశ తరుణి నేలితి విట్టె
చతురత మీకు సరసములే మంచివి

(||pallavi||)
īgĕ nīgu valasunu inniḍā jāṇavu nīvu
kaigŏnna mī veḍugala kaṁduvale maṁchivi

(||īgĕ||)
saligĕgala sadulu jaṁkiṁturu sŏladuru
yĕlamim̐ badigi nĕggu lĕṁcham̐garādu
talam̐pulum̐ dalam̐pulu tārugāṇalai yuṁḍide
mŏlaganavvuladoḍi monamule maṁchivi

(||īgĕ||)
premamu galuguvāru biguduru guṁpiṁturu
yemainā naṁdu kĕggu lĕṁcham̐garādu
momu momum̐ jāsugŏṁṭe mŏgamoḍa luppadilu
dīmasamudoḍi taridībule maṁchivi

(||īgĕ||)
saṁtamaina suṭṭamulu sādiṁturu bodiṁturu
idavulegāni yĕggu lĕṁcham̐garādu
tadido śhrīveṁkaḍeśha taruṇi nelidi viṭṭĕ
sadurada mīgu sarasamule maṁchivi