Eege neegu seligatto yillaalo kaani

ఈకె నీకు చెలికత్తో యిల్లాలో కాని
Language

(॥పల్లవి॥)
ఈకె నీకు చెలికత్తో యిల్లాలో కాని
దాకొని యడుగరా దీతలఁపు లెవ్వరికి

(॥ఈకె॥)
సెలవి నవ్వులతోనే చెలి నీ మొగము చూచీ
యెలమి నీ మర్మ మాకె యెరఁగఁబోలు
బలిమి నప్పటి నీతో పంతములే యాడీని
తెలియదు మీలోని తెరఁగు లెవ్వరికి

(॥ఈకె॥)
చిక్కించుక కొలువులో సిగ్గువడుతా మొక్కీ
గక్కన నాకె నీగుట్టు గనఁగ బోట
యెక్కడెక్కడో చూపి యెలయించవచ్చీని
వక్కణించరాదు మీ వరుస లెవ్వరికి

(॥ఈకె॥)
కనుబొమ్మలనే నీకుఁ గదిసి సన్నలు సేసీ
వెనకటి గుణా లాకె వినఁగఁబోలు
యెనసితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనె
వినకెట్టుండవచ్చు మి వేడుక లెవ్వరికి

(||pallavi||)
īgĕ nīgu sĕligatto yillālo kāni
dāgŏni yaḍugarā dīdalam̐pu lĕvvarigi

(||īgĕ||)
sĕlavi navvuladone sĕli nī mŏgamu sūsī
yĕlami nī marma māgĕ yĕram̐gam̐bolu
balimi nappaḍi nīdo paṁtamule yāḍīni
tĕliyadu mīloni tĕram̐gu lĕvvarigi

(||īgĕ||)
sikkiṁchuga kŏluvulo sigguvaḍudā mŏkkī
gakkana nāgĕ nīguṭṭu ganam̐ga boḍa
yĕkkaḍĕkkaḍo sūbi yĕlayiṁchavachchīni
vakkaṇiṁcharādu mī varusa lĕvvarigi

(||īgĕ||)
kanubŏmmalane nīgum̐ gadisi sannalu sesī
vĕnagaḍi guṇā lāgĕ vinam̐gam̐bolu
yĕnasidivi śhrīveṁkaḍeśha nannu niṁtalonĕ
vinagĕṭṭuṁḍavachchu mi veḍuga lĕvvarigi