Eege nee suttarigamu leṟumgudumu

ఈకె నీ చుట్టరికము లెఱుఁగుదుము
Language

(॥పల్లవి॥)
ఈకె నీ చుట్టరికము లెఱుఁగుదుము
మాకు నీవు లోఁగుదురా మరఁగు లింతేల

(॥॥)
కలువపూవుల వేసి కప్పురము మొవిఁజూపీ
పొలఁతికి నీ కెన్నటిపొందులోకాని
పిలిచీ మెల్లనె నిన్నుఁ బేరుకొని యంతలోనే
పలుకవయ్యా యేల పరాకు సేసేవు

(॥॥)
సిగ్గు గొంత చల్లి చల్లి సెలవుల నవ్వు నవ్వి
వెగ్గళించీఁ జేఁత లెంతవేడుకోకాని
వొగ్గీఁ దమ్ములానకు వూరకే చేతిసన్నల
యెగ్గులేదు చూడవయ్యా యేల దాఁచేవు తమి

(॥॥)
చన్ను మొనలు దాఁకించి సారెకు సేవలు సేసీ
యెన్నఁడు గూడితివో యింతకతొల్లి
యిన్నిటా శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
నన్నుఁ గూడితిని యెంత నాఁటకము సేసేవు

(||pallavi||)
īgĕ nī suṭṭarigamu lĕṟum̐gudumu
māgu nīvu lom̐gudurā maram̐gu liṁtela

(||||)
kaluvabūvula vesi kappuramu mŏvim̐jūbī
pŏlam̐tigi nī kĕnnaḍibŏṁdulogāni
pilisī mĕllanĕ ninnum̐ berugŏni yaṁtalone
palugavayyā yela parāgu sesevu

(||||)
siggu gŏṁta salli salli sĕlavula navvu navvi
vĕggaḽiṁchīm̐ jem̐ta lĕṁtaveḍugogāni
vŏggīm̐ dammulānagu vūrage sedisannala
yĕgguledu sūḍavayyā yela dām̐sevu tami

(||||)
sannu mŏnalu dām̐kiṁchi sārĕgu sevalu sesī
yĕnnam̐ḍu gūḍidivo yiṁtagadŏlli
yinniḍā śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
nannum̐ gūḍidini yĕṁta nām̐ṭagamu sesevu