ఈకె గలిగివుండఁగా నింకా నొకరా నీకు
(॥పల్లవి॥)
ఈకె గలిగివుండఁగా నింకా నొకరా నీకు
పైకొని పెండ్లాడితివి పదారువేలను
(॥॥)
కలికితనాల నాపె కతలుచెప్పనేరుచు
వలపులుచ ల్లుతా నవ్వఁగ నేరుచు
మెలుపున వద్దనుండి మేను విసుకనేరుచు
తిలకించి చిటుకలు దియ్యనేరుచు
(॥॥)
చక్కనిది జవరాలు సరసమాడనేరుచు
పక్కన మదిగరఁగఁ బాడనేరుచు
చక్కెరమోవి చూపి చవివుట్టించనేరుచు
మిక్కిలిరతుల నిన్ను మెప్పించనేరుచు
(॥॥)
పొందినచిత్తమురాఁ గాఁపురము సేయనేరుచు
ముందుముందే వేఁడుకొని మొక్కనేరుచు
అందపుశ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
యిందె నిన్నుఁగూడె నన్ను సేవించాఁదా నేరుచు
(||pallavi||)
īgĕ galigivuṁḍam̐gā niṁkā nŏgarā nīgu
paigŏni pĕṁḍlāḍidivi padāruvelanu
(||||)
kaligidanāla nābĕ kadalusĕppanerusu
valabulusa lludā navvam̐ga nerusu
mĕlubuna vaddanuṁḍi menu visuganerusu
tilagiṁchi siḍugalu diyyanerusu
(||||)
sakkanidi javarālu sarasamāḍanerusu
pakkana madigaram̐gam̐ bāḍanerusu
sakkĕramovi sūbi savivuṭṭiṁchanerusu
mikkiliradula ninnu mĕppiṁchanerusu
(||||)
pŏṁdinasittamurām̐ gām̐puramu seyanerusu
muṁdumuṁde vem̐ḍugŏni mŏkkanerusu
aṁdabuśhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
yiṁdĕ ninnum̐gūḍĕ nannu seviṁchām̐dā nerusu