ఈకాలం బెవ్వరి కైన యిచ్చకమే మేలు
(॥పల్లవి॥)
ఈకాలం బెవ్వరి కైన యిచ్చకమే మేలు
మీకేఁటికి నిష్టూరంబులు మితిఁ దానె బుద్ధి యెరిఁగీని
(॥ఈకాలం॥)
నగ నేలే చెలులాలా నటనల మీలోను
అడపడి నేఁ డతఁ డేమని నట్టె అవు ననరే
తెగనాడ వల దింకా తెలిపి చెప్ప నేలా
మొగమోటమినె వుందము మనముందరఁ దానె యెరిఁగీని
(॥ఈకాలం॥)
కడుఁ గడుఁ దప్పక చూడకురే కపటము దగిలీని
జడిగొని ఆతఁడు యెంత సేసినా సారెఁ బొగడ గదరే
తడవఁగ వల దింకా తరి గా దీవేళ
వడివోనివలపులు గలితే నొగిఁదాఁ బ్రియములు చెప్పీని
(॥ఈకాలం॥)
వెస నూరకె మొక్కకురే వెంగెము లయ్యీని
పొసఁగ నూరక దండ నిడిచి పొగడకురే మీరు నన్ను
పస గల శ్రీవెంకటేశ్వరుఁడు పై పై నన్నుఁ గూడె
వసమై యాతిని లోనై నడతము వడి నతఁడే మన్నించీని
(||pallavi||)
īgālaṁ bĕvvari kaina yichchagame melu
mīgem̐ṭigi niṣhṭūraṁbulu midim̐ dānĕ buddhi yĕrim̐gīni
(||īgālaṁ||)
naga nele sĕlulālā naḍanala mīlonu
aḍabaḍi nem̐ ḍadam̐ ḍemani naṭṭĕ avu nanare
tĕganāḍa vala diṁkā tĕlibi sĕppa nelā
mŏgamoḍaminĕ vuṁdamu manamuṁdaram̐ dānĕ yĕrim̐gīni
(||īgālaṁ||)
kaḍum̐ gaḍum̐ dappaga sūḍagure kabaḍamu dagilīni
jaḍigŏni ādam̐ḍu yĕṁta sesinā sārĕm̐ bŏgaḍa gadare
taḍavam̐ga vala diṁkā tari gā dīveḽa
vaḍivonivalabulu galide nŏgim̐dām̐ briyamulu sĕppīni
(||īgālaṁ||)
vĕsa nūragĕ mŏkkagure vĕṁgĕmu layyīni
pŏsam̐ga nūraga daṁḍa niḍisi pŏgaḍagure mīru nannu
pasa gala śhrīvĕṁkaḍeśhvarum̐ḍu pai pai nannum̐ gūḍĕ
vasamai yādini lonai naḍadamu vaḍi nadam̐ḍe manniṁchīni